తెలంగాణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, typos fixed: లో → లో
పంక్తి 133:
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్ళకే మళ్ళీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 1969లో [[మర్రి చెన్నారెడ్డి]] నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. అప్పుడు ప్రత్యేక తెలంగాణ నేపథ్యంలో ఏర్పడిన [[తెలంగాణ ప్రజా సమితి]] పార్టీ 1971లో 11 లోకసభ స్థానలలో విజయం సాధించింది. [[2001]], [[ఏప్రిల్ 27]]న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీని ఏర్పాటు చేశారు.
 
2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణాఏర్పాటుతెలంగాణా ఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోదమైన లక్ష్యంకొరకు [[శ్రీకృష్ణ కమిటీ]]ని నియమించగా ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసినా ఫలితంలేకపోయింది. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వం "ఐక్య కార్యాచరణ సమితి" చేతుల్లోకి వెళ్ళడంతో విద్యార్థులు, ఉద్యోగసంఘాలు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజుల సమ్మె చేశారు. 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపైబడి సమైక్యాంధ్ర ఉద్యమం నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటును ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్, బిల్లు తయారీ జరిగింది.<ref>{{Cite web|title=ముగిసిన కేబినెట్, తెలంగాణ నోట్‌కు ఆమోదం|url=http://telugu.oneindia.in/news/andhra-pradesh/telangana-note-be-placed-before-cabinet-123431.html |publisher=వన్ ఇండియా|date=Sep 3, 2013|accessdate=2014-01-31|archiveurl=https://web.archive.org/web/20190322110111/https://telugu.oneindia.com/news/andhra-pradesh/telangana-note-be-placed-before-cabinet-123431.html|archivedate=2018-03-21}}</ref> ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును<ref>{{Cite web|title=12లోగా అసెంబ్లీకి బిల్లు: కిరణ్ పావులు, 'టి' వ్యుహాలు|url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/t-bill-assembly-dec-12-126644.html |publisher=వన్ ఇండియా|date= 2013-12-06|accessdate=2020-08-03}}</ref> శాసనసభ, శాసనమండలిలో సుదీర్ఘ చర్చలు పూర్తికాకముందే, ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి. 2014, ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. 2014 పిభ్రవరిఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యధాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది.<ref>{{Cite web|title=తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.29వ రాష్ట్రంగా...|url=http://telugu.webdunia.com/newsworld/news/national/1402/20/1140220095_1.htm|publisher=వెబ్ దునియా|date= 2014-02-20|accessdate=2014-02-24|archiveurl=https://web.archive.org/web/20140303044936/http://telugu.webdunia.com/newsworld/news/national/1402/20/1140220095_1.htm|archivedate=2014-03-03}}</ref><ref name="reorganisation">{{Cite web|url=http://www.indiacode.nic.in/acts2014/6%20of%202014.pdf|title=The Andhra Pradesh Reorganisation Act, 2014|date=1 March 2014|website=India Code Legislative Department|publisher=Ministry of Law and Justice|page=2|url-status=dead|archive-url=https://web.archive.org/web/20150924034307/http://www.indiacode.nic.in/acts2014/6%20of%202014.pdf|archive-date=24 September 2015|access-date=14 July 2015}}</ref> 2014 జూన్ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.
 
== భౌగోళిక స్వరూపం ==
"https://te.wikipedia.org/wiki/తెలంగాణ" నుండి వెలికితీశారు