పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 17:
'''పాపం పసివాడు''' [[వి. రామచంద్రరావు]] దర్శకత్వంలో 1972 సెప్టెంబరు 29న విడుదలైన చిత్రం. ఇందులో [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]], [[దేవిక]], మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని [[అట్లూరి శేషగిరిరావు]] శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, చిత్రానువాదం, మాటలు [[గొల్లపూడి మారుతీరావు]] అందించాడు. [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం దర్శకత్వం వహించాడు<ref>{{Cite web|url=https://indiancine.ma/PFL|title=Papam Pasivadu (1972)|website=Indiancine.ma|access-date=2020-09-28}}</ref>. ''అమ్మా చూడాలీ'' అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.<ref>{{Cite web|url=https://idreampost.com/te/news/nostalgia/adventurous-telugu-movie-with-child-artist|title=పసివాడి సాహసంతో సక్సెస్ మంత్రం - Nostalgia|website=iDreamPost.com|language=te|access-date=2020-07-12}}</ref> ఎం. కన్నప్ప ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. బాలు ఎడిటర్ గా పనిచేశాడు.
 
1969లో దక్షిణాఫ్రికా చలన చిత్రమైన ''లాస్ట్ ఇన్ ది డెసెర్ట్''{{interlanguage link|Lost in the Desert|en}} అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం. విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధి వశాత్తూవిధివశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.
 
ఈ చిత్ర నిర్మాత ముందు సినిమాఅంతకుముందు మోసగాళ్ళకు మోసగాడు అనే చిత్రాన్ని ఎడారి నేపథ్యంలో తీశాడు. మరో సినిమా అదే వాతావరణంలో తీయాలనుకుని గొల్లపూడి మారుతీరావు చేత ''లాస్ట్ ఇన్ ది డెసెర్ట్''ను అనుసరించి కథను తయారు చేయించుకున్నాడు. 1972 మార్చిలో ప్రారంభమైన ఈ చిత్ర నిర్మాణం సుమారు 27 రోజులపాటు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా ప్రచారం కోసం వినూత్నంగా హెలికాప్టరుహెలికాప్టర్ ద్వారా కరపత్రాలు పంచి పెట్టారు. 1972 సెప్టెంబరు 29లో29న విడుదలైన ఈ చిత్రం వ్యాపారాత్మకంగా విజయం సాధించింది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు