కొంజేటి సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
సాయుధ పోరాట సమయంలో [[దేవులపల్లి వెంకటేశ్వరరావు]], రాఘవేంద్రరావు వంటి కమ్యూనిస్టు నాయకులు అప్పుడప్పుడు వచ్చి సత్యవతి వాళ్ళ బావికాడ తలదాచుకునేవాళ్ళు. సత్యవతి కుటుంబ సభ్యులు రహస్యంగా వాళ్ళకు అన్నం పెడుతుండేవారు. రజాకార్లకు ఆ విషయం తెలిసి ఇంటిమీద దాడిచేయడానికి వస్తున్నారన్న సమాచారం రావడంతో సత్యవతి నడుచుకుంటూ [[జగ్గయ్యపేట]]<nowiki/>కు వెళ్ళి, అక్కడినుండి రైలులో [[విజయవాడ]]<nowiki/>కు చేరుకొని స్థానిక [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)|కమ్యూనిస్టు పార్టీ]] ఆఫీసుకు చేరుకొని నెలరోజులు అక్కడ గడిపింది. పార్టీలో పనిచేయాలనుందని సత్యవతి అక్కడి నాయకులకు చెప్పడంతో రంగమ్మగా పేరు మార్చి, నల్లమలకు పంపించారు.
 
ఢిల్లీ నుంచి వచ్చిన కామ్రేడ్‌ దగ్గర తుపాకీ వాడడంలో ట్రైనింగ్‌ తీసుకుంది. 15 ఏళ్ళ వయసులో దళ కమాండర్‌గా నియమించబడింది. అంగీ, నిక్కరుతో భుజానికి ఒకవైపు రైఫిల్‌, మరోవైపు బుల్లెట్ల సంచీ తగిలించుకొని నల్లమల అడవుల్లో కొండలు, గుట్టల చాటున నాలుగేళ్లు రహస్య జీవితం గడిపింది. [[అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)|అచ్చంపేట]], [[అమ్రాబాద్ (నాగర్‌కర్నూల్ జిల్లా)|అమ్రాబాద్‌]] చుట్టుపక్క ఊర్లలో పెత్తందారులు చేస్తున్న దోపిడీ, దౌర్జన్యాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించింది. భూస్వాములు అక్కమంగా దాచిన ధాన్యాన్ని పేదలకు పంచింది.<ref name="కొంజేటి సత్యవతికి సన్మానం">{{cite news |last1=నవతెలంగాణ |first1=నల్గొండ |title=కొంజేటి సత్యవతికి సన్మానం |url=https://www.navatelangana.com/article/nalgonda/1099726 |accessdate=30 September 2021 |work=NavaTelangana |date=16 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210930103707/http://www.navatelangana.com/article/nalgonda/1099726 |archivedate=30 September 2021}}</ref>
 
== జైలు జీవితం ==
"https://te.wikipedia.org/wiki/కొంజేటి_సత్యవతి" నుండి వెలికితీశారు