రాజశేఖర చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 26:
నరహరి గోపాల కృష్ణమశెట్టి “శెట్టి” కులస్థుడు కనుక, ఆయన రచనను తొలి తెలుగు నవలగా అంగీకరించలేదనే వాళ్ళూ ఉన్నారు. కానీ కందుకూరి వీరేశలింగం పంతులుగారి “రాజశేఖర చరిత్రము” ఆయన సమకాలీన కాలాన్ని ప్రతిఫలించేటట్లు రాశారు. ఆయన రాసిన నవలకు వివేకచంద్రిక అనే పేరు కూడా ఉంది. ఆ నవలలో అంతరించిపోతున్న రాజరిక జీవిత లక్షణాలు కనిపిస్తాయి. దాంతో పాటూ అశాస్త్రీయ విషయాలను ఖండించటం కనిపిస్తుంది. మూఢ విశ్వాసాలను కొన్ని పాత్రల ద్వారా కల్పించి వాటి వల్ల జరుగుతున్న మోసాలను కూడా వివరించారు. ఈ నవల గోల్డ్‌స్మిత్ రాసిన “వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్” నవలకు అనుసరణ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ, ఈ నవల నిండా తెలుగు వాళ్ళ జీవితం, వాళ్ళు జీవించిన పరిసరాలూ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. పైగా కందుకూరి వారి రచనల నిండా ఆధునిక సంస్కరణ భావాలు ఉన్నాయి. నిజానికి తన పేరు చివర ‘పంతులు’ అనే గౌరవ వాచకాన్నీ, జంధ్యాన్నీ వదిలేస్తున్నానని ఆయన ప్రకటించారు. అయినా కానీ మనం పంతులుగారనే పిలుస్తున్నాం. ఇది ఆయనకున్న సంస్కరణ భావాలకున్న నిబద్దత.
 
ఇంకా అనేక లక్షణాలతో రాజశేఖర చరిత్రమే తొలి తెలుగు నవలగా గుర్తించబడుతుంది. సమన్వయ వాదులు మాత్రం “శ్రీ రంగరాజ చరిత్రము”ను తొలి తెలుగు చారిత్రక నవలకు పునాదులు వేసిన నవల అని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ఒకచోట చర్చించుకోవటమే తప్ప దీనిపై ఇప్పటికే తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నో చర్చోపచర్చలు జరిగాయి. పూర్వ పరిశోధనలే అయినా వాటినన్నింటినీ ఒకచోటకు చేర్చి చదువుకోవటమే తొలి తెలుగు శీర్షిక ఉద్దేశం.
 
==కధ==
"https://te.wikipedia.org/wiki/రాజశేఖర_చరిత్రము" నుండి వెలికితీశారు