కొండవీటి వెంకటకవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
రచనలు
పంక్తి 1:
'''కొండవీటి వెంకటకవి''' (1918 - 1991) ప్రసిద్ధ కవి, [[హేతువాది]] చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు '''కొండవీటి వెంకటయ్య'''. వీరు [[గుంటూరు]] జిల్లా [[సత్తెనపల్లి]] తాలూకా [[విప్పర్ల]] గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు [[జనవరి 25]], [[1918]] సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద ఉన్నత విద్య గడించాడు. 1936లో కిసాన్ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు.
 
పంక్తి 7:
[[నందమూరి తారకరామారావు]] వీరిని 1977లో పిలిపించి [[దానవీరశూరకర్ణ]] చిత్రానికి సంభాషణలు రాయించారు. తరువాత [[శ్రీమద్విరాటపర్వం]], [[శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర]] చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు.
 
[[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] వీరిని '[[కళా ప్రపూర్ణ]]' పురస్కారంతో గౌరవించింది. 1953 జనవరిలో కవిరాజు అనే బిరుదును కూడా పొందాడు.
 
వీరు[[ ఏప్రిల్ 7]], [[1991]] సంవత్సరం పరమపదించారు.
 
==వెంకటకవి కృతులు==
# కర్షకా! (1932)
# హితబోధ (1942)
# భాగవతులవారి వంశావళి (1943)
# ఉదయలక్ష్మీ నృసింహతారావళి (1945)
# చెన్నకేశవా! (1946)
# భావనారాయణ చరిత్ర (గద్యకావ్యము) (1953)
# దివ్యస్మృతులు (1954)
# నెహ్రూ చరిత్ర - ప్రథమ భాగము (1956)
# త్రిశతి (1960)
# నెహ్రూ చరిత్ర - ద్వితీయ భాగము (1962)
# బలి (1963)
 
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_వెంకటకవి" నుండి వెలికితీశారు