గీతా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
'''గీతా సుబ్బారావు''' తెలుగు రచయిత, కార్టూనిస్టు.<ref>[http://www.amazon.com/Geetha-Subbarao/e/B00JN558NM Geetha Subbarao, అమెజాన్ లో "చిన్నారి విజయం"]</ref>
==జీవిత విశేషాలు==
గీతా సుబ్బారావు పుట్టింది 14 నవంబర్ 1942 విజయనగరంలో. ఆయన అసలు పేరు "పిళ్ళా సుబ్బారావు". కానీ గీతా సుబ్బారావుగా ప్రసిద్ధి చెందారు. సినిమా వాళ్ళందరికీ పబ్లిసిటీ కింగ్‌గా కూడా ఆయన ఆత్మీయుడు. పత్రికల్లో కుంచెతో అనుక్షణపు గిలిగింతలు పెట్టే గెంతులే కాక, [[గీతా ఆర్ట్స్]], [[గీతా పబ్లిసిటీస్]], గీతా చిత్ర అంటూ పబ్లిసిటీ రంగంలో తనదైన కళాకాంతులు వెదజల్లిన వాడాయన. బాల సాహిత్య రచయితగానూ అవార్డులందుకున్న మనిషి. [[తెలుగు]]లో తొలి ప్యాకెట్ డైలీ కార్టూన్లు వేసిన క్రెడిట్ బహుశా పిళ్ళా సుబ్బారావ్ గారికే దక్కుతుంది. మరో విశేషం దినపత్రికల్లో ఆయన పుంఖాను పుంఖాలుగా పొలిటికల్ [[కార్టూన్లు]] వేసినా కార్టూన్లో నాయకుల క్యారికేచర్లు లేకుండానూ, రాజకీయ వ్యవస్థపై చురకలు వేసిన కార్టూనిస్టూ, అందునిమిత్తం ఒడిదుడుకులను మాత్రం ఎదుర్కొన్న కార్టూనిస్టూ, ఈయనే అనాలి.<ref>{{Cite web |url=http://sudhamadhuram.blogspot.in/2013/10/blog-post_5.html |title=గిలిగింతల గీతల్లో మిఠాయి పొట్లం - పత్రికలలో వార్త |website= |access-date=2016-01-03 |archive-url=https://web.archive.org/web/20160306234852/http://sudhamadhuram.blogspot.in/2013/10/blog-post_5.html |archive-date=2016-03-06 |url-status=dead }}</ref>
 
ఆయన చిన్నతనం నుండేకథలను వ్రాయడం ప్రారంభించారు. తొలి రచనే [[బెంగాలీ]]లోకి అనువాదం కావడం, సినిమా రూపంలో రావడం జరిగింది. బాలల రచనలో విశేష ప్రతిభ కనబరిచిన గీతా సుబ్బారావుకు మంగాదేవీ బాల సాహిత్య పురస్కారాన్ని అందించారు. ఈయన [[సెన్సార్‌]] బోర్డు సలహా మండలి సభ్యునిగా ఉన్నారు. సీనియర్‌ పాత్రికేయులైన సుబ్బారావు ఇప్పటి వరకు 35 నవలలు, వందలాది బాలల రచనలు చేశారు. ఈయన రచనలు అనేక భాషల్లోకి తర్జుమా అయ్యాయి. కొన్ని సినిమాల రూపంలోనూ వచ్చాయి.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=62670&SupID=19 సాహిత్యంతోనే [[తెలుగు]] భాషకు వెలుగు]</ref> ఆయన తనకు సన్మానం సందర్భంగా అందించిన రూ. 25 వేలను తిరిగి ఆ సంస్థకే ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్‌ మరిన్ని నిర్వహించాలన్న సదుద్దేశంతో ఈ నగదును సాయంగా అందించారు.
"https://te.wikipedia.org/wiki/గీతా_సుబ్బారావు" నుండి వెలికితీశారు