నిన్నే పెళ్ళాడతా: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె, ప్రవేశిక విస్తరణ
ట్యాగు: 2017 source edit
కథ చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 18:
}}
'''నిన్నే పెళ్ళాడతా''' 1996 లో [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[అక్కినేని నాగార్జున]], [[టబు]] ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాల్లో ఫిల్ం ఫేర్ (దక్షిణాది) పురస్కారాలు, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా అక్కినేని పురస్కారం, ఉత్తమ గాయకుడిగా రాజేష్ కు నంది పురస్కారం లభించాయి.
 
== కథ ==
శ్రీను ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/నిన్నే_పెళ్ళాడతా" నుండి వెలికితీశారు