వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''వికీపీడియా''' ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. అనేక భాషల్లో వికీపీడియా నిర్మితమౌతోంది. తెలుగు వికీపీడియాను ముద్దుగా '''తెవికీ''' అని కూడా అంటారు. వికీపీడియా మనందరిదీ. ఇక్కడ ఎవరైనా రాయవచ్చు, ఇతరులు రాసినవి సరిదిద్దవచ్చు. అలాగే మీరు రాసినవి ఇతరులు సరిదిద్దుతారు. ఇక్కడ అందరూ సమానమే! సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అయితే నిర్వహణా పరమైన కొన్ని పనులు చేసేందుకు గాను, కొందరు నిర్వాహకులు ఉంటారు. అనుభవశాలురైన సభ్యులే నిర్వాహకులుగా నియమితులవుతారు. వీరిని ఎన్నుకునేది కూడా తోటి సభ్యులే! వికీపీడియాలోని ముఖ్యాంశాల గురించి మీరీ పేజీలో చూడవచ్చు.
 
అల్ల్ గొనె...
==ఎడమవైపున ఉండే లింకులు==
ఒహ్ వెల్ల్ తూ బద్!
ఈ పేజీకి ఎడమ పక్కన గల మార్గదర్శకము, అన్వేషణ, పరికరాల పెట్టె లను చూడండి. వికీపీడియాలోని ఏ పేజీకి వెళ్ళినా మీకు ఈ లింకులు కనిపిస్తాయి. వీటి గురించి చూద్దాం:
 
===మార్గదర్శకము===
[[బొమ్మ:WikiNavLinks.png|thumb|right|250px|తెవికిలో ఎడమ భాగములోని లింకులు (మార్గదర్శకము)]]
ఇందులో కింది లింకులు ఉంటాయి.
;మొదటి పేజీ:వికీపీడియా [[మొదటి పేజీ|మొదటి పేజీకి]] లింకు ఇది.
;సముదాయ పందిరి:వికీపీడియాలో ప్రస్తుతం ఏమేం పనులు జరుగుతున్నాయి, ఏమేం చెయ్యాలని అనుకుంటున్నారు ఇలాంటి విషయాలకు సంబంధించిన విశేషాలు ఇక్కడ చూడవచ్చు.
;ప్రస్తుత ఘటనలు:జరుగుతున్న చరిత్ర లోని విశేషాల సమాహారం ఇది.
;ఇటీవలి మార్పులు:ఈ మధ్య కాలంలో వికీపీడియాలో జరిగిన అన్ని మార్పులను చూపించే జాబితా ఇది.
;యాదృచ్ఛిక పేజీ:ఈ లింకును నొక్కినపుడు వికీపీడియా ఏదో ఒక పేజీని ఎంపిక చేసి మీకు చూపిస్తుంది.
;సహాయము:వికీపీడియాకు సంబంధించి మీకు ఏమైనా సహాయం అవసరమైతే ఈ లింకును నొక్కి తెలుసుకోవచ్చు.
;విరాళములు:వికీపీడియా పూర్తిగా ప్రజల విరాళాల పైనే ఆధారపడుతుంది. విరాళం ఇవ్వదలచిన వారు ఈ లింకు నొక్కి, అక్కడి సూచనలను అనుసరించి తమ విరాళాన్ని ఇవ్వవచ్చు.
 
===అన్వేషణ===
[[బొమ్మ:WikiToolBox.png|thumb|right|250px|తెవికిలో ఎడమ భాగములోని లింకులు. అన్వేషణ (నీలములో) ఇంక పరికరాల పెట్టె (ఎరుపులో)]]
అన్వేషణ పెట్టె కింద రెండు మీటలున్నాయి: ''వెళ్ళు'', ''వెతుకు''. ''వెళ్ళు'' నొక్కినపుడు, మీరు అన్వేషణ పెట్టెలో రాసిన పదాలతో ఏదైనా పేజీ ఉంటే నేరుగా ఆ పేజీని తెరచి చూపిస్తుంది. లేకపోతే లేదని చూపిస్తుంది. ''వెతుకు''ను నొక్కినపుడు, పెట్టెలో రాసిన పదాలు వ్యాసంలో కలిగి ఉన్న అన్ని పేజీల జాబితాను చూపిస్తుంది.
 
'''అన్వేషణ పెట్టెలో మీరు ఇంగ్లీషులో రాస్తూ ఉంటే అది తెలుగులోకి మారిపోతూ ఉంటుంది.''' ఇంగ్లీషులోనే రాయాలంటే, కీబోర్డులోని "Esc" మీటను నొక్కండి.
 
===పరికరాల పెట్టె===
వ్యాసాలలో రచనలు చెయ్యడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పనులు చేసేందుకుగాను అవసరమైన పరికరాలను ఈ పెట్టెలో పొందుపరచాము.
 
;ఇక్కడికి లింకున్న పేజీలు:ఈ లింకును నొక్కినపుడు ప్రస్తుత పేజీకి లింకులు కలిగిన వికీపీడియాలోని ఇతర పేజీల జాబితాను చూపిస్తుంది.
;సంబంధిత మార్పులు:ఈ లింకు నొక్కినపుడు ఈ పేజీకి సంబంధించిన పేజీల్లో ఇటీవల జరిగిన మార్పుల జాబితాను చూపిస్తుంది.
;ఫైలు లోడింగ్:బొమ్మలు, ఆడియో వంటి ఫైళ్ళను అప్‌లోడు చేసేందుకు అవసరమైన సాధనం ఇది.
;ప్రత్యేక పేజీలు:వికీపీడియాలో వ్యాసాల పేజీలే కాక, అనేక ఇతర రకాల పేజీలు ఉన్నాయి. వాటిలో ప్రత్యేక పేజీలు ఒకటి. (ఈ పేజీల్లో సభ్యులు దిద్దుబాట్లు చేయజాలరు.) ఈ లింకును నొక్కినపుడు అన్ని ప్రత్యేక పేజీల జాబితాను చూడొచ్చు.
;ముద్రణా వెర్షన్‌:ఈ లింకును నొక్కినపుడు, ప్రస్తుత పేజీని ముద్రించుకునేందుకు వీలైన కూర్పును చూపిస్తుంది.
;శాశ్వత లింకు:వికీపీడియాలోని వ్యాసాలను మీరు ఇతర చోట్ల (వికీపీడియాకు బయట) యథేచ్ఛగా ఉదహరించవచ్చు. అయితే మీరు ఉదహరించిన తరువాత, సదరు వ్యాసంలో మార్పులు చేర్పులు జరగవచ్చు. మీరు ఉదహరించిన విషయం మారిపోవచ్చు. అలాంటి సందర్భంలో మీరు ఉదహరించిన విషయానికీ, ప్రస్తుతం ఉన్న కూర్పుకూ పొంతన ఉండకుండా పోవచ్చు. దీన్ని నివారించేందుకు ఈ "శాశ్వత లింకు" సౌకర్యాన్ని కల్పించాము. దీన్ని నొక్కినపుడు, పేజీ URL కు ఒక సంకేతం చేరుతుంది. వికీపీడియా బయట మీరు చేసే రచనలో మీరు ఈ URL నే ఉదహరిస్తారు. మీ పాఠకులు దాన్ని నొక్కినపుడు వారికి పూర్వపు కూర్పే కనపడుతుంది తప్ప, కొత్తగా చేరిన మార్పులు కనపడవు.
;Cite this article: వికీపీడియాకు బయట వ్యాసాలను ఉదహరించే వివిధ పద్ధతులను ఈ లింకు వివరిస్తుంది.
 
===ఇతర భాషలు===
కొన్ని పేజీల్లో ఈ లింకులు కూడా కనిపిస్తాయి. ఇతర భాషల్లో ఇదే వ్యాసానికి గల లింకులను ఇక్కడ చూడవచ్చు.
 
==పేజీ గురించి==