ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 49:
 
1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశాడు. అందుకే అమరగాయకుడు [[ఘంటసాల]] తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచాడు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]] లాంటి తెలుగు చిత్రాలే కాకుండా [[ఏక్ దూజె కేలియె|ఏక్ దుజే కేలియే]] లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. [[తెలుగు]], తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/breakhtml5.asp ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20080605193716/http://www.eenadu.net/breakhtml5.asp |date=2008-06-05 }} పై వ్యాసం. [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref>
 
బాలుకు తన వృత్తిపట్ల ఎంత అంకితభావమనడానికి ఒక ఉదాహరణ ఏమంటే 1989లో వచ్చిన కమల్ హసన్ చిత్రం [[ఇంద్రుడు చంద్రుడు (1989 సినిమా)|ఇంద్రుడు చంద్రుడు]]<nowiki/>లో ఒకపాత్రకి తగ్గట్టుగా "నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ" అనే పాటపాడి గొంతులో చిన్నగుల్ల వచ్చి పాడడానికి ఇబ్బంది పడి తర్వాత శస్ర్తచికిత్స చేయించుకొన్నారు.
 
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి '''శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని''' (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.