"ఆజాద్ హింద్ ఫౌజ్" కూర్పుల మధ్య తేడాలు

చి
("Indian National Army" పేజీని అనువదించి సృష్టించారు)
 
చి (వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సంస్థలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
సింగపూర్‌లో మాజీ INA సైనికులు విభిన్నమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సింగపూర్‌లో, భారతీయులు - ప్రత్యేకించి INA తో సంబంధం ఉన్నవారు - "ఫాసిస్టులు, జపనీయుల సహకారులుగా అవమానించబడ్డారు. కాబట్టి వారి పట్ల అసహ్యంతో వ్యవహరించారు. తరువాతి కాలంలో వీరి లోని కొందరు ప్రముఖ రాజకీయ సామాజిక నాయకులుగా ఎదిగారు. నేషనల్ యూనియన్ ఆఫ్ ప్లాంటేషన్ వర్కర్స్ రూపంలో కార్మిక సంఘాల ఏకీకరణలో మాజీ ఐఎన్ఏ నాయకులు నాయకత్వం వహించారు. మలయాలో, 1946 లో మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎంఐసి) ని స్థాపించడంలో INA కి చెందిన ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. జాన్ తివి దీని వ్యవస్థాపక అధ్యక్షుడు. రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంటుకు చెందిన సెకండ్-ఇన్-కమాండ్ జానకీ అతి నహప్పన్ కూడా MIC వ్యవస్థాపక సభ్యురాలు. తరువాత మలేషియా పార్లమెంటులోని దివాన్ నెగరాలో ప్రముఖ సంక్షేమ కార్యకర్త, విశిష్ట సెనేటర్‌ అయింది. ఝాన్సీ రాణి రెజిమెంటుకు చెందిన రసమ్మా భూపాలన్, తరువాత మలేషియాలో మహిళల హక్కుల కోసం పాటుపడీన సంక్షేమ కార్యకర్తగా విస్తృతంగా గౌరవించబడింది.
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం]]
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3378134" నుండి వెలికితీశారు