ఆజాద్ హింద్ ఫౌజ్: కూర్పుల మధ్య తేడాలు

→‎1947 తరువాత: మూలాల సవరణ
కొన్ని మూలాల సవరణ
పంక్తి 3:
1942 లో మొదటిసారి INA ఏర్పడినప్పుడు, మరింతమంది భారత సైనికులు ఫిరాయిస్తారనే ఆందోళన బ్రిటిష్-ఇండియన్ సైన్యానికి ఉండేది. [[సిపాయి]] విధేయతను కాపాడటానికి రిపోర్టింగ్ నిషేధాన్ని, "జిఫ్స్" అనే ప్రచారాన్నీ మొదలుపెట్టారు. సైన్యం గురించి రాసిన పీటర్ డబ్ల్యూ.ఫే వంటి చరిత్రకారులు, యుద్ధంలో ఐఎన్‌ఎ గణనీయమైన ప్రభావాన్ని చూపలేదని భావిస్తున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత చాలా మంది సైనికులను భారతదేశానికి పంపి, అక్కడ కొందరిపై దేశద్రోహం కేసులు పెట్టి విచారణ చేసారు. ఈ విచారణలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రేరేపకాలుగా మారాయి. 1946 లో రాయల్ ఇండియన్ నేవీలో [[రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు|బాంబే తిరుగుబాటు]], ఇతర తిరుగుబాట్లూ ఈ INA విచారణల నుండి ఉద్భవించిన జాతీయవాద భావాల వల్లనే సంభవించినట్లు భావిస్తున్నారు. సుమిత్ సర్కార్, పీటర్ కోహెన్, ఫే తదితర చరిత్రకారులు -ఈ సంఘటనలు బ్రిటిష్ పాలన ముగింపును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయని అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయంలో INA లో పనిచేసిన అనేక మంది వ్యక్తులు భారతదేశంలోను ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలలోనూ, ప్రజా జీవితంలో ప్రముఖమైన స్థానాల్లోకి ఎదిగారు. ముఖ్యంగా భారతదేశంలో [[లక్ష్మీ సెహగల్]], మలయాలో జాన్ తివి, జానకి అత్తినహప్పన్.
 
ఇది ఇంపీరియల్ జపాను తోటి, ఇతర అక్షరాజ్యాల తోటీ ముడిపడి ఉంది. జపాన్ చేసిన యుద్ధ నేరాలలో పాలుపంచుకున్నట్లు ఐఎన్‌ఎ దళాలపై ఆరోపణలు వచ్చాయి. <ref name="Fay423to424">{{Harvnb|Fay|1993|pp=423–424,453}}</ref> బ్రిటిషు సైనికులు, సైన్యంలో చేరని భారతీయ యుద్ధఖైదీలూ INA సభ్యులను అక్షరాజ్యాల సహకారులుగా భావించారు. <ref name="Toye1959pxiv">{{Harvnb|Toye|1959|loc=Mason, in Foreword, p. xiv}}</ref> కానీ యుద్ధం తర్వాత వారిని చాలా మంది భారతీయులు దేశభక్తులుగా చూసారు. భారత స్వాతంత్య్రం వచ్చిన వెంటనే [[భారత జాతీయ కాంగ్రెస్]] వారిని స్మరించుకున్నప్పటికీ, భారత ప్రభుత్వం అహింసా ఉద్యమంలో పాల్గొన్నవారికి ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుల హోదాను INA సభ్యులకు ఇవ్వడానికి నిరాకరించింది. ఐతే, ఫౌజు మాత్రం భారతీయ సంస్కృతి, రాజకీయాలలో ఒక ప్రముఖమైన ఉద్వేగభరితమైన అంశంగా నిలిచిపోయింది. <ref name="Toye1959pxivLebrapxv">{{Harvnb|Lebra|2008|p=xv}}</ref><ref name="Toye1959pxiv2">{{Harvnb|Toye|1959|loc=Mason, in Foreword, p. xiv}}</ref><ref name="Fayp228">{{Harvnb|Fay|1993|p=228}}</ref>
 
== మొదటి INA ==
"https://te.wikipedia.org/wiki/ఆజాద్_హింద్_ఫౌజ్" నుండి వెలికితీశారు