ఆజాద్ హింద్ ఫౌజ్: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని మూలాల సవరణ
→‎మూలాలు: కొన్ని మూలాల సవరణ, కొన్నిటి చేర్పు
పంక్తి 18:
 
=== సుభాష్ చంద్ర బోస్ ===
భారతదేశంలోకి తిరుగుబాటు సైన్యాన్ని నడిపించడానికి సుభాష్ చంద్రబోస్ సరైన వ్యక్తి అని F కీకన్‌ పని ప్రారంభంలోనే ప్రతిపాదన వచ్చింది. మోహన్ సింగ్ స్వయంగా, ఫుజివారాను కలిసిన తర్వాత, జాతీయవాద భారత సైన్యానికి బోసు సరైన నాయకుడని సూచించాడు. అనేక మంది అధికారులు, సైనికులూ - యుద్ధ ఖైదీల శిబిరాలకు తిరిగి వెళ్ళిన వారితో పాటు అసలు స్వచ్ఛందంగా ముందుకు రానివారిలో కొంతమందితో సహా - సుభాస్ బోస్ నాయకత్వం వహించినట్లయితే మాత్రమే తాము ఐఎన్‌ఎలో చేరడానికి సిద్ధమని తెలియజేసారు. బోస్ జాతీయవాది. 1922 లో ప్రతిష్టాత్మకమైన [[సివిల్ సర్వీస్|ఇండియన్ సివిల్]] సర్వీసు పదవికి రాజీనామా చేసిన తర్వాత గాంధీ ఉద్యమంలో చేరాడు. కాంగ్రెస్‌లో వేగంగా ఎదిగాడు. పదేపదే జైలు శిక్ష అనుభవించాడు. 1920 ల చివరినాటికి అతను, [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] ఇద్దరూ భవిష్యత్తు కాంగ్రెసు నాయకులుగా పరిగణించబడ్డారు. <ref name="Toye2007prebelleader">{{Harvnb|Toye|2007|loc=The Rebel President}}</ref> ''1920 ల చివరలో,'' భారతదేశం బ్రిటిష్ ఆధిపత్యంగా ఉండాలన్న మునుపటి కాంగ్రెస్ లక్ష్యం నుండి విభేదించి, పూర్తి స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చిన మొదటి కాంగ్రెస్ నాయకులలో అతను ఒకడు. <ref name="Toye2007prebelleaderToye2007prebelleader2">{{Harvnb|Toye|2007|loc=The Rebel President}}</ref> [[భారత స్వాతంత్ర విప్లవోద్యమం|బెంగాల్‌లో, విప్లవోద్యమంలో]] పని చేస్తున్నాడని బ్రిటిషు అధికారులు అతనిపై పదేపదే ఆరోపణలు చేశారు. అతని నాయకత్వంలో, బెంగాల్‌లోని కాంగ్రెస్ యువజన సంఘం బెంగాల్ వాలంటీర్స్ అనే పాక్షిక-సైనిక సంస్థగా నిర్వహించబడింది. బోస్ [[మహాత్మా గాంధీ|గాంధీ]] ప్రవచించిన అహింసను ఖండించాడు; ప్రభుత్వంతో బోస్ పడే ఘర్షణలతో గాంధీ ఒప్పుకోలేదు. <ref name="Toye2007prebelleaderToye2007prebelleader3">{{Harvnb|Toye|2007|loc=The Rebel President}}</ref> నెహ్రూతో సహా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గాంధీకి విధేయులుగా ఉండేది. <ref name="Toye2007prebelleaderToye2007prebelleader4">{{Harvnb|Toye|2007|loc=The Rebel President}}</ref> గాంధీతో బహిరంగంగా విభేదించినప్పటికీ, బోస్ 1930 లలో రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచారు. గాంధీ నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ అతను రెండవసారి విజయం సాధించాడు. గాంధీ బలపరచిన అభ్యర్థి [[భోగరాజు పట్టాభి సీతారామయ్య|భోగరాజు పట్టాభి సీతారామయ్యను]] వోటింగులో ఓడించాడు. కానీ బోస్‌తో కలిసి పనిచేయడానికి నిరాకరిస్తూ కార్యవర్గం మొత్తం రాజీనామా చేసింది. <ref name="Toye1959p100">{{Harvnb|Toye|1959|p=88}}</ref> బోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తన సొంత వర్గం [[ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్|ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌]] స్థాపించాడు . <ref name="Fayp197">{{Harvnb|Fay|1993|p=197}}</ref>
 
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో, బోస్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. <ref>{{Cite web|url=http://www.revolutionarydemocracy.org/rdv7n1/Bose.htm|title=Subhas Chandra Bose in Nazi Germany|year=1997|website=Sisir K. Majumdar|publisher=South Asia Forum Quarterly|pages=10–14|access-date=2011-08-12}}</ref> అతను మారువేషంలో తప్పించుకుని, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా గుండా మొదట సోవియట్ యూనియన్‌కు, ఆ తరువాత జర్మనీకీ వెళ్ళాడు. 1941 ఏప్రిల్ 2 న బెర్లిన్ చేరుకున్నాడు. అక్కడ అతను జర్మనీకి పట్టుబడిన భరతీయ యుద్ధ ఖైదీలతో భారతీయ సైనికుల సైన్యాన్ని ఏర్పాటు చెయ్యాలని అనుకున్నాడు, ఫ్రీ ఇండియా లీజియన్‌ను, ''ఆజాద్ హింద్'' రేడియోనూ ఏర్పాటు చేశాడు. జపాన్ రాయబారి ఒషిమా హిరోషి ఈ పరిణామాల గురించి టోక్యోకు సమాచారం అందించాడు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, జపనీస్ ఇంటెలిజెన్స్ సర్వీసులు తాము స్వాధీనం చేసుకున్న భారతీయ సైనికులతో మాట్లాడటం ద్వారా, జాతీయవాదిగా బోస్‌ అత్యంత గౌరవించబడ్డాడనీ, తిరుగుబాటు సైన్యానికి నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తిగా భారత సైనికులు భావిస్తున్నారనీ తెలుసుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఆజాద్_హింద్_ఫౌజ్" నుండి వెలికితీశారు