పొట్టి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
 
==స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర==
పొట్టి శ్రీరాములు [[1930]]లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ [[1941]]-[[1942|42]] సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, [[క్విట్ ఇండియా ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమాల్లో]] పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింప బడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ (Committee for History of Andhra Movement) అధ్యయనంలో పొట్టి శ్రీరాములు - మహాత్మా గాంధీల మధ్య అనుబంధం గురించి ఇలా వ్రాయబడింది. - "సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చరిత్రాత్మకమైనది. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధత లు మూర్తీభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని గరువు ప్రపంచానికే గురువు, సత్యాన్ని అహింసను ఆరాధించే ప్రేమమూర్తి. దరిద్ర నారాయణుల ఉద్ధతికి అంకితమైన మహానుభావుడు..... శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలనూ, కులపతి (గాంధీ) ఆదరాన్నీ చూరగొన్నాడు." <ref name=hindu1>[http://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm హిందూ పత్రికలో వ్యాసం]</ref>
[[గుజరాత్]] రాష్ట్రంలోని [[రాజ్‌కోట్|రాజ్‌కోట్‌]]లోను, ఆంధ్రలో [[కృష్ణా జిల్లా]]లోని [[కొమరవోలు]]లోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కొమరవోలులో [[యెర్నేని సుబ్రహ్మణ్యం]] నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. [[1943]]-[[1944|44]]ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. [[1946]]లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించాడు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
"https://te.wikipedia.org/wiki/పొట్టి_శ్రీరాములు" నుండి వెలికితీశారు