"పొదుపు" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
(అనువాదం మూస తొలిగింపు)
(వ్యాసం విస్తరణ)
సామాన్యమైనసాధారణ వాడుకలో '''పొదుపు''' అంటే తమ ఆదాయంలో [[డబ్బు]]ను ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. - ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి. <ref>"Random House Unabridged Dictionary." Random House, 2006</ref>. [[ఆర్ధిక శాస్త్రం]] పరిభాషలో [[ఆదాయం]]లో [[వినియోగం]] చేయగా మిగిలిందే పొదుపు. <!-- పొదుపులో రకాలు, పొదుపును నిర్ణయించే కారకాలు. పొదుపు సిద్ధాంతాలు, ఆర్థిక వ్యవస్థపై పొదుపు ప్రభావము తదితర అంశాలు కూడా --> మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం. పెట్టుబడిలో నష్టభయం (రిస్క్) ఉంటుంది కనుక ధనాన్ని ఖర్చుపెట్టకుండా ఉంచుకోవడమే పొదుపుకు సరైన అర్ధం. వ్యావహారికంగా '''పొదుపు''' ఒక విధమైన ఆలోచనా విధానం, జీవన విధానం కూడాను. (ఉదాహరణకు - "పొదుపుగా బ్రతుకు గడపడం, దుబారాను వ్యతిరేకించడం" వంటి అర్ధాలలో)
 
 
== వడ్డీ రేటులు ==
వాస్తవ వడ్డీరేటు అనగా పన్ను మినహాయింపులు మరియు ద్రవ్యోల్బణ రేటు తగ్గింపులు. కొన్ని సందర్భాలలో వాస్తవ వడ్డీరేటు శూన్యం కంటే తక్కువ ఉండవచ్చు దాన్నే ద్రవ్యోల్బణ నష్ట ప్రభావంగా పేర్కొనవచ్చు.
 
==పొదుపును నిర్ణయించే కారకాలు==
అర్థశాస్త్రం ప్రకారం పొదుపును నిర్ణయించే కారకాలను క్రిందివిధంగా విభజిమ్చవచ్చు:
;ఆదాయం:
పొదుపును నిర్ణయించే ప్రధాన కారకం ఆదాయం. ఆదాయం అధికంతే ఉంటే సాధారణంగా పొదుపు కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఆదాయానికి మరియు పొదుపునకుఆవినాభావ సంబమ్ధం ఉంది. తక్కువ ఆదాయం కలవారికి వారికి లభించే కొద్ది ఆదాయం వారి అవసరాలను తీర్చుకోవడానికే ఉపయోగపడుతుంది. కాబట్టి వినియోగం చేయగా పొదుపుగా మిగిలే భాగం అతిస్వల్పంగా ఉంటుంది.
;వస్తుసేవల ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం):
నిత్యావసరాలకు వినియోగించే వస్తుసేవల ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణ సమయంలో దానికి తగనట్లుగా ఆదాయం పెరగనిచో ఖర్చు పెరిగి పొదుపు భాగం తగ్గడం సాధారణమే.
;భవిష్యత్తు అవసరాలు:
పొదుపుపై భవిష్యత్తు అవసరాలు కూడా ప్రభావం చూపిస్తుంది. వివాహాలు, వేడుకలు, ముసలితనం, స్వంత గృహం మొదలగు భవిష్యత్తు అవసరాలకై పొదుపు చేయడం సాధారణంగా తక్కువ ఆదాయం కలవారిలో జరుగుతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/338086" నుండి వెలికితీశారు