పొదుపు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
;భవిష్యత్తు అవసరాలు:
పొదుపుపై భవిష్యత్తు అవసరాలు కూడా ప్రభావం చూపిస్తుంది. వివాహాలు, వేడుకలు, ముసలితనం, స్వంత గృహం మొదలగు భవిష్యత్తు అవసరాలకై పొదుపు చేయడం సాధారణంగా తక్కువ ఆదాయం కలవారిలో జరుగుతుంది.
;మానసిక కారణాలు:
వ్యక్తుల మానసిక కారణాలు కూడా పొదుపును నిర్ణయిస్తాయి. భవిష్యత్తులో ధరలు తగ్గవచ్చని భావిస్తే వ్యక్తులు ప్రస్తుత వినియోగాన్ని తగ్గించి పొదును పెంచవచ్చు. లేదా కొందరి వ్యక్తులకు స్వభావరీత్యా ఉండే పిసినాసితనం కూడా పొదుపుకు దోహదపడుతుంది.
;ప్రభుత్వ పథకాలు:
ఆర్థిక వ్యవస్థలో పొదుపు అవసరమైనప్పుడు ప్రభుత్వం పొదుపునకు ప్రాత్సాహం కల్పించడానికి వడ్డీరేట్లను పెంచుతుంది. ఇవి సాధారణంగా ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వాలు తీసుకొనే సాధారణ చర్యలు. ప్రభుత్వాలు కల్పించే అనేక సబ్సిడీ పథకాలు కూడా వ్యక్తుల వినియోగ ఖర్చులను తగ్గించి పొదుపును పెంచుతాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పొదుపు" నుండి వెలికితీశారు