శ్రీనివాస చక్రవర్తి (ఆచార్యులు): కూర్పుల మధ్య తేడాలు

ఫిభ్రవరి --> ఫిబ్రవరి
పంక్తి 1:
'''డాక్టర్ [[శ్రీనివాస చక్రవర్తి]]''' ఐఐటీ [[చెన్నైఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌|ఐఐటీ మద్రాసు]] లో న్యూరోసైన్సు విభాగంలో [[గురువు|ఆచార్యుడు]]. ఆయనకు విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి. దానిని [[తెలుగు]]లో ప్రచారం చేయడం కోసం అనేక పుస్తకాలు రచించాడు. శాస్త్ర విజ్ఞానం అనే పేరిట ఓ బ్లాగును కూడా నిర్వహిస్తున్నాడు.
 
== జీవిత విశేషాలు ==
ఆయన స్వస్థలం [[విశాఖపట్టణం]]. [[ఐఐటీ మద్రాస్|మద్రాసు ఐఐటీ]] నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత [[టెక్సస్|టెక్సాస్]] విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్, పీ.హెచ్.డీ చేశాడు. ఇందుకోసం ఎనిమిదేళ్ళు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]లో ఉన్నాడు. పరిశోధన కోసం అనేక దేశాలు తిరిగాడు. స్వతహాగా పుస్తక ప్రియుడు కావడం వలన ఆయా ప్రదేశాలలో గ్రంథాలయాలను సందర్శించాడు. అక్కడి విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు ఆసక్తికరంగా ఉండటం గమనించాడు. తెలుగులో కూడా అలాంటి [[పుస్తకాలు]] అందుబాటులో ఉంటే విద్యార్థులు చిన్నప్పటి నుండే అలాంటి పుస్తకాలు చదివి మంచి శాస్త్రవేత్తలు కాగలరని ఆశించి తన బ్లాగు ద్వారా పుస్తకాల ద్వారా రచనలు ప్రారంభించాడు.