గృహ ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 23:
పూజా బియ్యము = 8 కెజీలు
 
[[ధర్మ సింధు]]<ref>గృహ ప్రవేశము, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 673-4.</ref> ప్రకారం ఆచరించవలసిన పద్ధతి ఈ విధంగా ఉంది. గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ [[స్నానాలు]] చేసి బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు, ముహూర్త సమయమునకు కొంచెము ముందుగా చేరుకొనవలెను. గృహ ద్వారము వద్ద దూడతో ఉన్న [[ఆవు]]ను పూజించి దానికి ఇష్టమైన ఆహారమును పెట్టవలెను. అష్టదిక్కుల, భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తువరుణ దేవతలకు మృష్టాన్నము, వసంతంతో నింపిన [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] కాయ బలిహరణము (ఉద్దిబేడలు, పెసరపప్పు, బియ్యము, పసుపు, సున్నము కలిపి వండిన అన్నము) ఈయవలెను. దీనిని వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కుల పెట్టవలెను. కలశమున గంగాది తీర్థములను ఆవాహన చేసి పూజించవలెను. దీనిని "గంగపూజ" అంటారు. శుభ ముహూర్తమున దూడతో ఆవును ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడికాలు, ధర్మపత్ని ఎడమకాలు గృహమునందు పెట్టవలెను.
 
[[పాలు]] పొంగించి, క్షీరాన్నమును వండి దానితో వాస్తుపురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్ని హోత్రమునకు [[నెయ్యి]], [[చక్కెర]] వేసి నమస్కరించవలెను. వాస్తుపూజకు ముందు గణపతి పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణము పెట్టువరకు నూతన గృహమున ఏమియు వండరాదు.
"https://te.wikipedia.org/wiki/గృహ_ప్రవేశం" నుండి వెలికితీశారు