దుర్గం చిన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== జననం - విద్యాభ్యాసం==
దుర్గయ్య 1974, మే 17న రాజాం, మల్లక్క దంపతులకు [[తెలంగాణ]] రాష్ట్రం [[మంచిర్యాల జిల్లా]], [[నెన్నెల్‌ మండలం]], [[జండావెంకటాపూర్]] గ్రామంలో జన్మించాడు. దుర్గయ్యకు ఒక అన్న (బాలస్వామి), ఇద్దరు అక్కలు (రాజుబాయి, చిన్నక్క) ఉన్నారు. ఈయన వృత్తి వ్యవసాయం. తమ కుటుంబానికి ఉన్న ఐదెకరాల మామిడి తోట, రెండెకరాల పొలంలో దుర్గయ్ వ్యవసాయ పనులు చేసేవాడు. దుర్గయ్య చదువంతా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగింది. ఐదవ తరగతి వరకు స్వగ్రామంలో చదువుకున్న దుర్గయ్య, తరువాత పక్కనవున్న [[అవాడం|ఆవుడం]] గ్రామానికి రోజు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి పదవ తరగతి పూర్తిచేశాడు. ఆ తర్వాత [[మంచిర్యాల]]<nowiki/>లో ఒక గది కిరాయికి తీసుకుని ఇంటర్మీడియెట్, డిగ్రీ (బి.ఏ) వరకు చదువుకున్నాడు.<ref name="Member's Profile - Telangana-Legislature2">{{cite news|url=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|title=Member's Profile - Telangana-Legislature|last1=Telangana Legislature|date=2018|work=|accessdate=13 July 2021|archiveurl=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|archivedate=13 July 2021}}</ref>
 
== వివాహం - పిల్లలు ==
పంక్తి 33:
 
==రాజకీయ విశేషాలు==
ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే విప్లవోద్యమాల వైపు ఆకర్షితుడై పిడీఎస్‌యూలో చేరి చురుగ్గా పనిచేశాడు. ఆ సమయంలో జన్నారంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు హాజరయ్యాడు. అక్కడ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత వేముపల్లి వెంకట్రామయ్యతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం సికాసలో పనిచేశాడు. రెండు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో కూడా ఉన్నాడు.
 
1995లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్నయ్య, [[తెలుగుదేశం పార్టీ]] నుండి నెన్నెల్ జడ్పిటీసీగా, 2001లో ఎంపీపీగా, 2014లో ఎంపీటీసీగా గెలిచాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సిపిఐ పార్టీ అభ్యర్థి [[గుండా మల్లేష్]] పై 52,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="D. Chinnaiah">{{cite web|url=https://nocorruption.in/politician/durgam-chinnaiah/|title=Durgam Chinnaiah|last1=దుర్గం చిన్నయ్య |website=nocorruption.in|accessdate=30 April 2019}}</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ ముందస్తు ఎన్నికల]]లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ పై 11,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Durgam Chinnaiah Biography | Bellampalli MLA">{{cite web |last1=దుర్గం చిన్నయ్య |title=Durgam Chinnaiah Biography |3=Bellampalli MLA |url=http://beinglegends.com/durgam-chinnaiah-biography/ |website=beinglegends.com |accessdate=30 April 2019 }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== సేవా కార్యక్రమాలు ==
 
* నెన్నెల మండలం [[గుండ్లసోమారం]] గ్రామానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థికి మహారాష్ట్రలో ట్రిపుల్‌ ఐటీలో సీటు కోసం రూ.18,500 ఫీజుకు ఆర్థిక సహాయం అందించాడు.
* మంచిర్యాలకు చెందిన ఓ బీటెక్‌ విద్యార్థి రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండగా కిడ్నీని అమర్చడానికి రూ.12 లక్షలు సీఎం రిలీఫ్‌ఫండ్‌ మంజూరు చేయించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దుర్గం_చిన్నయ్య" నుండి వెలికితీశారు