పాకాల తిరుమల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
== జననం ==
[[కరీంనగర్]] జిల్లా [[అన్నారం]] గ్రామంలో [[1915]], [[జనవరి 4]] న జన్మించాడు. [[1942]]లో [[బొంబాయి]] సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి చిత్రకళల మొదటి ర్యాంకుతో డిప్లొమా పొందాడు. [[దేశం]]లోని అన్ని ముఖ్య పట్టణాల లోనే కాక [[ఆస్ట్రేలియా]], [[యు.కె]], [[జపాన్]], [[పశ్చిమ జర్మనీ]] తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించాడు.
తనతో భావ సారూప్యత కలిగిన నాటి యువ చిత్రకారులు మాజిద్, ఎం. ఏ. భోస్లే, బాప్తిస్టా, ఎం.వి, కులకర్ణిలతో కలిసి "ది కాంటెంపరరీ గ్రూప్ ఆఫ్ పైంటర్స్" అనే సంస్థను కూడా స్థాపించి నిరంతరం చిత్రకళా కార్యక్రమాలను నిర్వహించేవాడు.
 
[[ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ]] విశిష్ట సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అనేక హోదాల్లో పనిచేసాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డులెన్నో అందుకున్నాడు. [[హైదరాబాదు]] నారాయణ గూడ లోని తన నివాసాన్ని ఒక పెద్ద చిత్రకళా ప్రదర్శనా నిలయంగా తీర్చిదిద్దిన పి.టి.రెడ్డి చిరస్మరణీయుడు. తెలంగాణ జీవితం, ఘర్షణ, పల్లెటూరు రైతు, చిక్కిన స్త్రీ, ఆందోళనలు అన్నీ కలిసిపోయిన రంగుల నైపుణ్యం ఆయనది. [[హైదరాబాద్]], [[బొంబాయి]] వీధులు, [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]], [[రాజకీయాలు|రాజకీయ]], [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]] ప్రభావాలు, మార్మిక, తాంత్రిక, శృంగార భావనల సమ్మిశ్రితం ఆయన కళ. కర్రతో, రాతితో ఆయన మలిచిన శిల్పాలు ప్రత్యేకం.