దసరా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి {{AKAM ప్రాజెక్టు పేజీ|status=విస్తరణ}}
పంక్తి 73:
* [[పార్వతి]]
 
== స్వాతంత్య్ర సాధనలో ==
1757లో జరిగిన [[ప్లాసీ యుద్ధం]]<nowiki/>లో [[రాబర్టు క్లైవు|రాబర్ట్‌ క్లైవ్‌]] సారథ్యంలోని [[ఈస్టిండియా కంపెనీ]] సేన బెంగాల్‌ నవాబు [[సిరాజుద్దౌలా]]<nowiki/>ను ఓడించి బెంగాల్‌పై పట్టు సంపాదించింది. భారత్‌లో తొలి విజయానికి ప్రతీకగా దుర్గామాతకు పూజచేసి విజయోత్సవం జరుపుకున్న ఈ ఉత్సవాలు క్రమంగా జాతీయోద్యమానికి ఊతమయ్యాయి. అంతకుముందు ఇళ్లకే పరిమితమైన ఈ దసరా నవరాత్రులు క్రమంగా సామాజిక రూపం దాల్చటం కీలక పరిణామం. ఈస్టిండియా రాకతో బెంగాల్‌లో కీలకభూమిక పోషించిన జమీందార్లు, సంపన్నులు తమ ఆధిపత్యాన్ని, ప్రభుత్వంలో పట్టును, దర్పాన్ని చాటడానికి ఈ ఉత్సవాలను వేదికలుగా చేసుకున్నారు. తమ అధికారానికి కూడా ఈ ఉత్సవాలు దోహదం చేస్తుండటంతో ఈస్టిండియా కంపెనీ అధికారులూ ప్రోత్సహించారు. గవర్నర్‌ జనరల్‌ [[లార్డ్‌ వెస్లీ]] కాళీమాతకు గౌరవ ప్రదంగా తొమ్మిది తుపాకుల శాల్యూట్‌ను ప్రవేశపెట్టారు.
అలా జమీందార్ల పర్యవేక్షణలో సాగిన దుర్గా పూజ జాతీయోద్యమం ప్రభావంతో సామాన్య ప్రజల ఉద్యమంగా మారింది. 1919లో జమీందార్లకు సంబంధం లేకుండా సామాన్య ప్రజానీకం దుర్గాపూజ నిర్వహించింది. దీన్ని బరోయారి (12 మందితో చేసిన) పూజ అంటారు. బాగ్‌బజార్‌లో సర్వజనపూజ మొదలైంది. వీటిలో క్రమంగా జాతీయోద్యమ నాయకులు, విప్లవనాయకులు కూడా ప్రవేశించారు. 1930లో కోల్‌కతా మేయర్‌గా ఉన్న [[సుభాష్ చంద్రబోస్|నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌]] సర్వజన పూజను ముందుండి నడిపించారు. జాతీయోద్యమ ప్రచారానికి, స్వదేశీ వస్తువుల ప్రోత్సాహానికి ఈ ఉత్సవాలు వేదికగా మారాయి.
==బాహ్య లింకులు==
*[https://www.myoksha.com/navratri-colors-2017/ నవరాత్రి రంగులు]
"https://te.wikipedia.org/wiki/దసరా" నుండి వెలికితీశారు