మంగళగిరి వస్త్రాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 40:
 
==జాతీయ హోదా==
[[జాతీయ చేనేత దినోత్సవం]] సందర్భంగా దేశంలోని నాణ్యత, ప్రమాణాలున్న చేనేత చీరలకు గుర్తింపు ఇవ్వాలనే ఆలోచన చేసింది ప్రభుత్వం. అందుకు దేశవ్యాప్తంగా వున్న చేనేత సంఘాలు, నేతల నుంచి తమ ఉత్పత్తుల్ని ఆహ్వానించింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి [[మంగళగిరి]], [[ధర్మవరం]], [[వెంకటగిరి]], [[ఉప్పాడ]], జమదాని ఇలా దేశంలో 76 రకాల పేరుబడ్డ చేనేత వస్త్రాలన్నీ నాణ్యతగల 'భారత చేనేత బ్రాండ్‌' గుర్తింపు కోసం పోటీపడ్డాయి. అలా తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడ్డ చేనేత చీరల్లో మన మంగళగిరి నుంచి పణిదపు వీరాస్వామి తయారుచేసిన చీర నెంబర్‌వన్‌ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఇలా మంగళగిరికి చెందిన మాస్టర్స్‌ వీవర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు వీరాస్వామి చేతిలోపడి మంగళగిరి చీర 'భారత చేనేత బ్రాండ్‌' గుర్తింపుతో మరోసారి తన గత [[వైభవం|వైభవ]]పు ఉనికిని చాటుకుంది. పడుగు, పేక (నిలువు, అడ్డం) 80 కౌంట్‌గల అల్లిక, నిజామ్‌ డిజైన్‌ బోర్డర్‌, నాణ్యతగల రంగుల అద్దకం వంటి అంశాలు వీరాస్వామి రూపొందించిన చీరను నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెట్టాయి. ఇప్పుడు మంగళగిరి చీరంటే 'ఇండియా హ్యాండ్‌లూమ్‌'కే బ్రాండ్‌ అంబాసిడర్‌.<ref>[{{Cite web |url=http://www.prajasakti.com/Content/1730275 |title=మంగ‌ళ‌గిరి చీర‌ల‌కు వీర‌స్వా‌మీ భార‌త్ బ్రాండ్‌!!] |access-date=2016-01-26 |website= |archive-date=2015-12-20 |archive-url=https://web.archive.org/web/20151220195105/http://www.prajasakti.com/Content/1730275 |url-status=dead }}</ref>
==నిజాం డిజైన్స్==
ఒకప్పుడు అంటే పాతిక ఇరవై ఏళ్ల క్రితం మంగళగిరి చేనేత వస్త్రాలంటే కేవలం పెద్దవయసు వారికే అన్నట్టుగా ఆ పరిధిలోనే వ్యాపారాలు సాగేవి. అప్పటిదాకా ఉన్న డిజైన్ల స్థానంలో నిజాం నిర్మాణాలను పోలిన డిజైన్లతో బోర్డర్లను (చీర అంచు) రూపొందించడం మొదలుపెట్టాక వ్యాపారసరళి మారింది. అన్ని వయసుల వారినీ ఆకర్షించేలా నిజాం డిజైన్స్‌తో మంగళగిరి చీరలు క్రమేణా మార్కెట్‌ని పెంచుకోవడం ఆరంభమైంది. నాటి నుంచి పిన్నలకూ పెద్దలకూ అందాన్నిచ్చే చీరలు మొదలుకొని, పంజాబీ డ్రెస్‌ మెటీరియల్‌, మగవారు ధరించే దుస్తులు వరకూ ఇలా మంగళగిరి ఉత్పత్తులో వైవిధ్యం పెరిగింది. ఇప్పటికీ మంగళగిరి చీరల్లో నిజామ్‌ బోర్డర్‌ డిజైన్‌లకే గిరాకీ ఎక్కువ. దీనికి కూడా ఓ కారణం ఉంది. అప్పట్లో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా నిజామ్‌ డిజైన్లని చీర బోర్డర్లో నేయడం కేవలం మంగళగిరి చేనేతకారుల వల్లే సాధ్యమయ్యింది. ఆ కళానైఫుణ్యం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
"https://te.wikipedia.org/wiki/మంగళగిరి_వస్త్రాలు" నుండి వెలికితీశారు