పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపఘ్ని]], [[సగిలేరు]], [[చెయ్యేరు]], బొగ్గేరు, బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది [[భారత దేశం|భారత దేశపు]] మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] (48,276 చ.కి.మీ.), [[కర్ణాటక]] (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
 
పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న ప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది. అక్కడి నుంచి ఈ నది [[వైఎస్‌ఆర్ జిల్లా|కడప జిల్లా]]<nowiki/>లో [[పొట్లదుర్తి|పోట్లదుర్తి]], [[హనుమానగుత్తి|హనుమనగుత్తి]], [[కోకటం|కోగటం]], [[పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా)|పుష్పగిరి]], [[చెన్నూరు]], [[లింగంపల్లె (సిద్ధవటం)|లింగంపల్లె]], [[జ్యోతి (సిద్ధవటం మండలం)|జ్యోతి క్షేత్రం]], [[సిద్ధవటం]] గ్రామాలను ఆనుకుని ప్రవహించి [[సోమశిల ప్రాజెక్టు|సోమశిల]] రిజర్వాయర్ ను చేరుతుంది. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, [[కుందూ|కుముద్వతి]], వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని[[పుష్పగిరి ఆలయ సముదాయము|పుష్పగిరి క్షేత్రాన్ని]] '''పంచనదీక్షేత్ర'''మంటారు. మొదట్లో కడప నవాబుల రాజధానిగా సిద్ధవటం ఉండేది. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా సిద్ధవటానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో పాలనాకేంద్రాన్ని కడపకు మార్చారు. ప్రస్తుతం కడప నగరానికి, పెన్నేటికి మధ్య దూరం దాదాపు 5 కిలోమీటర్లు.
 
==పెన్నా నది పరివాహక రాజ్యాలు, కోటలు==
[[గండికోట]]: ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[కడప జిల్లా]] [[జమ్మలమడుగు]] తాలూకాలో [[పెన్నా]] నది ఒడ్డున గల ఒక [[దుర్గం]]. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నది వల్ల ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు [[గండికోట]] అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నది, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.
 
[[సిద్ధవటం కోట]]: దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తలతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది. [[మట్ల అనంతభూపాలుడు|మట్లి అనంతరాజు]] సిద్ధవటం మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. మట్లి రాజుల పతనం తర్వాత [[ఔరంగజేబు]] సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. అప్పట్నుంచి కడప నవాబులు సిద్ధవటం కోట నుంచే పాలించేవారు. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా సిద్ధవటానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో పాలనాకేంద్రాన్ని [[కడప]]<nowiki/>కు మార్చారు. ప్రస్తుతం కడప నగరానికి, పెన్నేటికి మధ్య దూరం దాదాపు 5 కిలోమీటర్లు.
 
==పెన్నా నది మీద ప్రాజెక్టులు==
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు