ఇబ్రాహీం (ప్రవక్త): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇబ్రాహీం''' [[ఇస్లాం]] ప్రవక్తలో ముఖ్యుడు. బైబిల్ మరియు తౌరాత్ (తోరాహ్) లలో ఇతని పేరు 'అబ్రహాము' గా ప్రస్తావింపబడినది. తండ్రిపేరు ''ఆజర్'' లేక ''తారఖ్'', ఇతడు విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే సంచారజాతికి చెందినవాడు, తానూ విగ్రహాలను తయారుచేసి అమ్మేవాడు. తనకుమారుణ్ణి (ఇబ్రాహీం ను) గూడా విగ్రహాలు అమ్మడానికి పంపేవాడు. విగ్రహాలుకొని వాటినిపూజించే ప్రజలను చూసి ఇబ్రాహీం ఆలోచనల్లో పడేవాడు. విగ్రహాలు మానవసృష్టి. సృష్టిని సృష్టికర్తగా భావించడం అహేతుకమని, వీటన్నికీ అతీతంగా విశ్వంలో ఏదో శక్తివుందని ఆశక్తియే పరమేశ్వరుడని ప్రగాఢంగా నమ్మాడు. తనతండ్రి తయారుచేసిన విగ్రహాలను నమ్మలేక, అమ్మలేక తండ్రిచే నానాతిట్లూ తిన్నాడు. ఇబ్రాహీంకు ఇరువురు భార్యలు '[[హాజిరా]] ' మరియు '[[సారా]] '. ఇతని కుమారులు [[ఇస్మాయీల్]] మరియు [[ఇస్ హాఖ్]] లు, వీరూ ప్రవక్తలే. ఇబ్రాహీం కు ప్రవక్తలపితామహుడిగా గౌరవిస్తారు. [[ఇస్లాం]] లో ఇతనికి ''ఖలీలుల్లా'' గా బిరుదు గలదు. [[ఖలీలుల్లా]] , '[[ఖలీల్]] ' [[కలీల్]] అంటే దేవుని స్నేహితుడు, మిత్రుడు అని అర్ధం. ఇస్లాంలో ఇతనికి ''హనీఫ్'' అనే బిరుదు గూడాగలదు.[[ హనీఫ్]] అనగా ఏకేశ్వరవిధానాన్ని కనుగొన్నవాడు. ఇతను ప్రవేశపెట్టిన విధానాన్ని [[ఇబ్రాహీం మతము]] అనికూడా సంబోధిస్తారు.[[యూదులు]] [[క్రైస్తవులు]] [[ ముస్లిములు]] ముగ్గురూ తమ విశ్వాసానికి మూల పురుషునిగా ఇతన్ని భావిస్తారు.
 
ఇబ్రాహీం పేరు [[ఖురాన్]] లోని 25 వివిధ [[సూరా]] లలో ప్రస్తావింపబడినది. [[మూసా]] (మోషే) తరువాత ఎక్కువగా ప్రస్తావింపబడిన పేరు ఇది. <ref name="EoI_Abraham"> Ibrahim, [[Encyclopedia of Islam]]</ref>
"https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_(ప్రవక్త)" నుండి వెలికితీశారు