పునీత్ రాజ్‍కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
పునీత్ రాజ్ కుమార్ ను తన తండ్రి రాజ్ కుమార్ సినిమా సెట్స్ కు తీసుకవెళ్ళవాడు, అలా ఆయన పుట్టిన ఏడాదిలోనే వి.సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమడ కనికే' చిత్రంలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. అప్పటికి పునీత్ వయసు కేవలం ఆరు నెలలు. పునీత్ తరువాత బాల నటుడిగా భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస బెళక్కు, చలిసువ మోడగులు, భక్త ప్రహ్లాద, ఎరాడు నక్షత్రగలు, యారీవను, బెట్టాడా హువు, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో నటించాడు. ఆయన 1985లో నటించిన "బెట్టాడ హూవు" చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు.<ref name="చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా..">{{cite news |last1=TV5 News |title=చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా.. |url=http://www.tv5news.in/cinema/puneeth-rajkumar-biography-784306 |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archiveurl=http://web.archive.org/web/20211029102536/http://www.tv5news.in/cinema/puneeth-rajkumar-biography-784306 |archivedate=29 October 2021 |language=en}}</ref>
 
పునీత్ రాజ్‌కుమార్‌ 2002లో 'అప్పు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇది తెలుగులో రవితేజ నటించిన [[ఇడియట్]] సినిమాకు రీమేక్. ఆయన మౌర్య, అజయ్అజయ, పవర్, మిలనా, కన్నడిగా, బిందాస్, వంశీ, జాకీ, హుడుగారు, అన్న బాండ్, రానా విక్రమ, రాజకుమార లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఆయన మిలనా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సువర్ణ ఫిల్మ్ అవార్డును 2008లో బిందాస్ మూవీతో ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నాడు.
 
పునీత్ రాజ్‌కుమార్‌ 2019లో తొలిసారిగా కవలుదారీ చిత్రాన్ని నిర్మించాడు. ఆయన పలు టి.వి. షో లకు హోస్ట్ గా, జడ్జిగా , యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడు. పునీత్ 2012, 2013లలో కన్నడద కొట్యాధిపతి షో ను రెండు సీజన్స్ పాటు హోస్ట్ గా వ్యవహరించి, 2019లో మూడోసారి కన్నడద కొట్యాధిపతి షో కు హోస్ట్ గా వ్యవహరించాడు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు.
"https://te.wikipedia.org/wiki/పునీత్_రాజ్‍కుమార్" నుండి వెలికితీశారు