ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 46:
 
=== గాయకునిగా ప్రయత్నం ===
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు [[సుసర్ల దక్షిణామూర్తి]], [[పెండ్యాల నాగేశ్వరరావు]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] లు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో [[ఎస్.పి.కోదండపాణి|ఎస్. పి. కోదండపాణి]] బాలు ప్రతిభను గమనించాడు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చాడు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. [[1966]]లో నటుడు, నిర్మాత అయిన [[పద్మనాభం]] నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. "''ఏమి ఈ వింత మోహం''" అనే పల్లవి గల ఈ పాటను ఆయన [[పి.సుశీల|పి. సుశీల]], [[కల్యాణం రఘురామయ్య]], [[ప్రతివాది భయంకర శ్రీనివాస్|పి. బి. శ్రీనివాస్]] లతో కలిసి పాడాడు.<ref name=tamilstar>tamilstar వెబ్సైటు నుండి [http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20051117102300/http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml |date=2005-11-17 }} గురించి వివరాలు [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref> ఈ చిత్రానికిఎస్చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్ తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి అవకాశాలు ఇప్పించేవాడు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.
 
1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశాడు. అందుకే అమరగాయకుడు [[ఘంటసాల]] తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచాడు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]] లాంటి తెలుగు చిత్రాలే కాకుండా [[ఏక్ దూజె కేలియె|ఏక్ దుజే కేలియే]] లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. [[తెలుగు]], తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/breakhtml5.asp ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20080605193716/http://www.eenadu.net/breakhtml5.asp |date=2008-06-05 }} పై వ్యాసం. [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref>
 
బాలుకు తన వృత్తిపట్ల ఎంత అంకితభావమనడానికిఅంకితభావముందో తెలియడానికి ఒక ఉదాహరణ ఏమంటే 1989లో వచ్చిన కమల్ హసన్ చిత్రం [[ఇంద్రుడు చంద్రుడు (1989 సినిమా)|ఇంద్రుడు చంద్రుడు]]<nowiki/>లో డ్యూయెల్ రోల్స్ లో ఒకపాత్ర(జి.కె.రాయుడు)మాట్లాడే యాసకి తగ్గట్టుగా "నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండూ" అనే పాటపాడి గొంతులో చిన్నగుల్ల వచ్చి పాడడానికి ఇబ్బంది పడి తర్వాత శస్ర్తచికిత్స చేయించుకొన్నారు.
 
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికిఅయనికి '''శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని''' (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.
 
=== నటునిగా ===