సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
'''సిరిసిల్ల,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు]] చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో [[సిరిసిల్ల పురపాలకసంఘం]] గా ఏర్పడింది.<ref name=":0">{{Cite web|url=https://sircillamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Sircilla Municipality|website=sircillamunicipality.telangana.gov.in|access-date=5 May 2021}}</ref> ఇక్కడ పెద్ద సంఖ్యలో పవర్ లూమ్‌లు, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్, [[అద్దకం|డైయింగ్]] యూనిట్లు ఉన్నందున దీనిని ''టెక్స్‌టైల్ టౌన్'' అని కూడా పిలుస్తారు''.'' 40,000 పవర్ లూమ్‌లతో [[తెలంగాణ]] రాష్ట్రంలో అతిపెద్ద టెక్స్‌టైల్ హబ్ గా ఉంది.<ref name="about">https://sircillamunicipality.telangana.gov.in/</ref> విశాలాంధ్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో మొదటి విశాలాంధ్ర మహాసభ సిరిసిల్లలోనే జరిగింది.
 
== భౌగోళికం ==
ఈపట్టణం {{Coord|18.38|N|78.83|E|}} అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.<ref>[http://www.fallingrain.com/world/IN/02/Siricilla.html Falling Rain Genomics, Inc – Siricilla]</ref> దీని సగటు ఎత్తు 322 మీటర్లు (1056 అడుగులు). దీనికి ఉత్తరాన 130 కి.మీ.ల దూరంలో [[సికింద్రాబాద్]], పశ్చిమాన 40 కి.మీ.ల దూరంలో [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్]], ఉత్తరాన 35 కి.మీ.ల దూరంలో [[సిద్ధిపేట|సిద్దిపేట]], తూర్పున 56 కి.మీ.ల దూరంలో [[కామారెడ్డి]] ఉన్నాయి. ఇక్కడికి 10 కి.మీ.ల దూరంలో [[వేములవాడ|చారిత్రాత్మకమైన వేములవాడ]] ఆలయ పట్టణం ఉంది.
 
==విద్యుత్ సరఫరా==
Line 40 ⟶ 43:
* 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.<ref name=":0" />
 
== గ్రామ ప్రముఖులు ==
 
* [[మిద్దె రాములు]]: హన్మాజీపేట గ్రామానికి చెందిన [[ఒగ్గుకథ|ఒగ్గు కథా కళాకారుడు.]]
* [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి. నారాయణ రెడ్డి]]: గేయ రచయిత, తెలుగులో [[జ్ఞానపీఠ పురస్కారం|మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.]]
* [[అనభేరి ప్రభాకర రావు|అనభేరి ప్రభాకర్ రావు]]: స్వాతంత్ర్య సమరయోధుడు, [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ తిరుగుబాటు]] ప్రధాన కార్యకర్త.
* [[చెన్నమనేని రాజేశ్వరరావు]]: స్వాతంత్ర్య సమరయోధుడు, సిరిసిల్ల నుండి ఆరుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే.
* [[సి.హెచ్.విద్యాసాగర్ రావు|చెన్నమనేని విద్యాసాగర్ రావు]]: పారిశ్రామికవేత్త, మాజీ కేంద్ర హోం మంత్రి, [[మహారాష్ట్ర]], [[తమిళనాడు]] మాజీ గవర్నర్.
* [[పైడి జైరాజ్]]: భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సిరిసిల్ల" నుండి వెలికితీశారు