"కోమగట మారు సంఘటన" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమంలో విప్లవ కార్యకలాపాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
(Add 1 book for వికీపీడియా:నిర్ధారత్వం (20211102)) #IABot (v2.0.8.2) (GreenC bot)
''కోమగట మారు'' సెప్టెంబర్ 27 న [[కోల్‌కాతా|కలకత్తా]] చేరుకుంది. నౌకాశ్రయంలోకి ప్రవేశించిన తరువాత, ఓడను బ్రిటిష్ గన్‌బోట్ నిలిపివేసి, ప్రయాణీకులకు కాపలా పెట్టారు. బ్రిటిష్ రాజ్ ప్రభుత్వం ''కోమగట మారు'' ప్రయాణీకులను చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్వయంగా ఒప్పుకున్న వారిగా మాత్రమే కాకుండా, ప్రమాదకరమైన రాజకీయ ఆందోళనకారులుగా కూడా చూసింది. పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోని దక్షిణ ఆసియన్ల మధ్య తిరుగుబాటు సృష్టించడానికి శ్వేత జాతీయుల్లోని, దక్షిణ ఆసియన్ల లోని విప్లవశక్తులు కలిసి ఈ సంఘటనను ఉపయోగించుకుంటున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం అనుమానించింది. ఓడ బడ్జ్ బడ్జ్ వద్ద దిగినప్పుడు, బాబా గుర్దిత్ సింగ్‌ను, వారి నాయకులుగా భావించిన మరో ఇరవై మంది ఇతర వ్యక్తులనూ అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లారు. అతను అరెస్టును ప్రతిఘటించాడు, అతని స్నేహితుడు పోలీసుపై దాడి చేశాడు. ఓడలో అల్లర్లు రేగాయి. పోలీసులు కాల్పులు జరిపగ, పంతొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. కొందరు తప్పించుకున్నారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కొందరిని వారి గ్రామాలకు పంపేసారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నంత కాలం వారిని గ్రామ నిర్బంధంలోనే ఉంచారు. ఈ సంఘటన బడ్జ్ బడ్జ్ అల్లర్లుగా ప్రసిద్ధి చెందింది.
 
గుర్దిత్ సింగ్ సాంధు పోలీసుల నుండి తప్పించుకుని 1922 వరకు అజ్ఞాతంలో ఉన్నాడు. [[మహాత్మా గాంధీ]] అతన్ని "నిజమైన దేశభక్తుడి" లాగా లొంగిపోవాలని కోరగా అతను లొంగిపోయాడు. ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. <ref>{{Cite book|title=Pacific Connections|url=https://archive.org/details/pacificconnectio0000chan|last=Chang|first=Kornel|date=2012|publisher=University of California Press|isbn=9780520271692|page=[https://archive.org/details/pacificconnectio0000chan/page/147 147]}}</ref>
 
== ప్రాముఖ్యత ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3390149" నుండి వెలికితీశారు