బిరియాని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 27:
స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన [[బ్లాక్ కామెడీ]] సినిమా '''''బిరియాని'''''. [[కార్తిక్ శివకుమార్]], [[హన్సికా మోట్వాని]], మాండీ థాకర్, ప్రేమ్ జీ అమరెన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆయనకి సంగీతదర్శకుడిగా 100వ సినిమా కావడం విశేషం. శక్తి శరవణన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ప్రవీణ్-శ్రీకాంత్ కూర్పును అందించారు. చెన్నై, హైదరాబాద్, అంబూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా 2013 డిసెంబరు 20న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలయ్యింది.
==కథ==
సుధీర్‌ ([[కార్తీ]]), పరశు (ప్రేమ్‌జీ) చాలా మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి [[రాజమండ్రి]]లో తమ కార్యాలయ కొత్త శాఖ తెరుస్తుంటే వెళతారు. తిరిగి వస్తుండగా ఓ ‘మాయ’లాడి (మాండీ తక్కర్‌) వలలో పడి ఆమెతో పాటు హోటల్‌కి వెళతారు. తప్పతాగి తెల్లారి లేచి చూసేసరికి తాము ఒక కిడ్నాప్‌ కేసులో ఇరుక్కుంటారు. వరదరాజులు ([[నాజర్‌]]) అనే వ్యాపారవేత్తని వీరిద్దరూ కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు ఆరోపిస్తారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయిన ఇద్దరికీ తమ కారు డిక్కీలో వరదరాజులు శవం కనిపిస్తుంది. ఈ హత్య కేసు తమ మెడకే చుట్టుకుంటుందని అర్థం చేసుకున్న తర్వాత దానినుంచి బయటపడేందుకు పథకం రచిస్తారు. అసలు వరదరాజులుని ఎవరు చంపుతారు. వీరిపై నింద ఎందుకు నెడతారు? అన్నది మిగిలిన కథ.<ref name="సినిమా రివ్యూ: బిరియాని">{{cite news |last1=Telugu Great Andhra |title=సినిమా రివ్యూ: బిరియాని |url=https://telugu.greatandhra.com/movies/reviews/review-biriyani-49036.html |accessdate=3 November 2021 |work= |archiveurl=httphttps://web.archive.org/web/20211103110506/https://telugu.greatandhra.com/movies/reviews/review-biriyani-49036.html |archivedate=3 Novemberనవంబర్ 2021 |language=en |url-status=live }}</ref>
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/బిరియాని_(సినిమా)" నుండి వెలికితీశారు