హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

→‎జననం: దోష నివారణ
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎జననం: దోష నివారణ
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
ఈయన [[1936]]లో [[సెప్టెంబర్ 2]] న తూర్పుగోదావరి [[పిఠాపురం]] మండలం [[రాపర్తి]] గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు [[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] అనే గ్రంథ రచయిత.
 
కాకినాడ పిఠాపురం రాజా (పి.ఆర్.) కళాశాల లో చదువుకునే రోజుల్లో హరనాథ్ [[ఇన్‌స్పెక్టర్ జనరల్ (నాటకం)|ఇన్‌స్పెక్టర్ జనరల్]] వంటి<ref> ఉత్తమ నాటకం ఇన్‌స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. [[కందిమళ్ళ సాంబశివరావు]], ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14</ref> వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరనాథ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన [[మా ఇంటి మహాలక్ష్మి (1959 సినిమా)|మా ఇంటి మహాలక్ష్మి]] 1959 లో [[హైదరాబాద్]] సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాథ్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.<ref>{{Cite web |url=http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-04-25 |archive-url=https://web.archive.org/web/20080303230229/http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm |archive-date=2008-03-03 |url-status=dead }}</ref> [[నందమూరి తారక రామారావు]] నిర్మించిన [[సీతారామకల్యాణం]] అనే సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా... [[చిరంజీవి]] నటించిన, [[నాగు]] సినిమా.నాగు సినిమా లో ఆయన తండ్రి పాత్ర పోషించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/హరనాథ్" నుండి వెలికితీశారు