దేవరకొండ బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న చిన్న మార్పులు
పంక్తి 26:
తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా వుండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన [[1966]] [[జూలై 1]] న అనారోగ్యంతో రాలిపోయాడు.
 
==ప్రశంసలు==
==ప్రసంశలు==
 
'''రా.రా.''': తిలక్ కవిత్వంలోని కొన్ని అనభ్యుదయకర ధోరణులను ఎత్తిచూపి విమర్శించినా, భావుకత్వం ముఖ్యమైన లక్షణంగా ఉండేది. తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం - కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయ స్పందన శక్తి. ఈ భావుకత్వానికి తోడు, తన హృదయంలోని అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తీ, అలంకారపుష్టీ, కలసి రావడంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగినాడు అంటూ ప్రముఖ మార్కిస్టు విమర్శకుడు రా.రా ప్రశంసించాడు.
 
<poem>
:దేవుడా
:రక్షించు నాదేశాన్ని
:పవిత్రులనుండి, పతివ్రతలనుండి
:పెద్దమనుషుల నుండి, పెద్దపులులనుండి
Line 40 ⟶ 42:
:శ్రీమన్మద్గురు పరంపరనుండి...
</poem>
'''చీకోలు సుందరయ్య''' : వీళ్లందరినుంచీ ఈ సమాజాన్ని కాపాడమని వేడుకొన్న కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌. ''నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన అమ్మాయిలు'' అని పేర్కొన్న ఈ కవి కవిత్వంలోనే కాదు, కథా రచనలోను బలమైన ముద్రవేశారు. తన కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించుకొన్నారు. '''ఆయన కథలు సమాజపు ఆనవాళ్లు''' - <ref>[http://www.eenadu.net/archives/archive-21-6-2008/sahithyam/display.asp?url=chaduvu50.htm ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం]</ref>
 
<poem>
Line 52 ⟶ 54:
అంటూ తన [[ఎలిజీ]]లో (జవాబు రాని ప్రశ్న) [[శ్రీశ్రీ]] అభివర్ణించాడు.
 
'''గిరిజా మనోహర్ బాబు''' : కవితాసతి నుదుట నిత్య రసగంగాధర తిలకంగా, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసినరాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్ధకత కలిగించాడు.. తాలోత్తాలంగా ఎగిసిన భావ, అభ్యుదయ కవితోద్యమాల నేపధ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది .. వ్యావహారిక భాష, రసదృష్టి, వాస్తవికతా దృక్పధం, అనితర సాధ్యమైన శైలి తిలక్‌లో మనకు గోచరించే కొన్ని కోణాలు. <ref name="sata"/>
 
 
'''వేలూరి వేంకటేశ్వరరావు''' : .. తిలక్‌ మనకి ఆరోజులనాటి (60 ల్లో) వీర అభ్యుదయవాది (ultra progressive) గా ముందుకొస్తాడు. .. తిలక్‌, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండుమెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి. కాకుంటే “రహస్యసృష్టి సానువులనుండి జారిపడే కాంతి జలపాతాన్ని చూపించు, మమ్మల్ని కనికరించు,” అని రాయలేడు. “మంచిగంధంలాగ పరిమళించే మానవత్వం మాకున్న ఒకే ఒక అలంకారం,” అని ఇంకే కవి రాయగలడు? . ..తను ప్రార్థిస్తున్న దేవుడు, ఆ దేవుడు ఎవరైతేనేం, తన కోరికలు తీర్చలేడని తిలక్‌ కి తెలుసు. నాకు చందమామలో జింక కావాలంటే, ఏ దేవుడు ఇవ్వగలడు? తిలక్‌ ప్రగతి శీలుడైన మానవతావాది. అంటే, ఎప్పటికైనా తన కోరికలు ఏదోరకంగా నెరవేరుతాయని నమ్మిన కవి. మనిషిలో మంచిని నమ్మిన కవి. <ref>[http://www.eemaata.com/em/issues/200509/65.html వేలూరి వేంకటేశ్వరరావు - "ఈమాట" అంతర్జాల పత్రికలో]</ref>
 
 
'''కొట్టెకోల విజయ్‌కుమార్‌''' : కవిత్వం మనస్సుకీ ఉద్రేకాలకీ సంబంధించింది. ఈ మనస్సునీ ఉద్రేకాల్ని కొలిచే సరైన మానం ఇదివరకు లేదు. ఇకముందు రాదు అని చెప్పవచ్చును. అంతవరకు కవిత్వానికి సరైన నిర్వచనం రాదు. మన లోపల్లోపల జరిగే ఒకానొక అనుభూతి విశిష్టత కవిత్వానికి ఆధారం అని తిలక్‌ ప్రకటించినాడు, కవితాజ్ఞాని అయినాడు. తిలక్‌ కవిత్వానికి అసలు రూపం అమృతం కురిసిన రాత్రి దీనిలోని ప్రతి కవిత కొత్త శిల్పంతో కొత్త భావంతో రక్తి కడుతుంది. హృదయాన్ని కదిలిస్తుంది. మెదడుకి పదును పెడుతుంది. భావ తీవ్రతతో పాఠకులలో ఒకవిధమైన మానసికావస్థను కలిగించినాడు. వచన కవితా నిర్మాణ శిల్పరహస్యవేది అయిన తిలక్‌ చిన్నవయస్సులోని జులై 2న 45 సంవత్సరములకే మరణించాడు. 'తిలక్‌ మంచి అందగాడు, మానసికంగా మెత్తనివాడు, స్నేహశీలి కవి, రసజ్ఞుడు' అని కుందుర్తి అమృతం కురిసిన రాత్రి పీఠికలో అన్నాడు. <ref>[http://www.andhraprabha.com/sunday/sundayItems.asp?id=ASL20080127021303&eTitle=AP+Sunday+-+Literature&rLink=0 కొట్టెకోల విజయ్‌కుమార్‌ - ఆంధ్రప్రభలో వ్యాసం]</ref>
 
 
'''శ్రీశ్రీ''' :
<poem>
గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
నభీస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి
</poem>
 
==తిలక్ రచనలు==