తెలుగు సాహిత్యం యుగ విభజన: కూర్పుల మధ్య తేడాలు

(వ్యాసం మొదలు)
 
 
==యుగ విభజన విధానాలు==
రచనా సౌలభ్యం కోసం సాహితీ చరిత్రాధ్యయనకారులు వాఙ్మయ చరిత్రను కొన్ని యుగములుగా విభజిస్తారు.
 
* [[కందుకూరి వీరేశ లింగం పంతులు]] - తమ "ఆంధ్ర కవుల చరిత్ర"లో "ప్రాచీన కవులు", "మధ్యయుగ కవులు", "ఆధునిక కవులు" అని విభజించాడు. అతడు వ్రాసినది కవుల చరిత్ర గనుక ఇది సమంజసము.
 
* కొందరు రాజ వంశములను బట్టి విభజించారు - చాళుక్య యుగము, రెడ్డి రాజ యుగము, విజయనగర యుగము ఇలా.. [[ఆరుద్ర]] తన [[సమగ్ర ఆంధ్ర సాహిత్యం]]లో ఈ విధానం అవలంబించాడు.
 
* ఆయా కాలాలలో ప్రముఖంగా వెలువడిన సాహిత్య ప్రక్రియలను బట్టి - పురాణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, గద్య గేయ యక్షగాన యుగము, ఖండకావ్య (భావ కవితా) యుగము ఇలా..
 
* ఆయా కాలాలలో ప్రసిద్ధులైన, మరియు ఇతరులకు మార్గ దర్శకులైన కవులను బట్టి - నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము ఇలా..
 
* [[దివాకర్ల వేంకటావధాని]] - తన "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము"లో - కావ్య ప్రక్రియలను బట్టి - ప్రాఙ్నన్నయ యుగము, భాషాంతరీకరణ యుగము, కావ్య యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము, ఆధునిక యుగము
 
* [[పింగళి లక్ష్మీకాంతం]] - "ఆంధ్ర సాహిత్య చరిత్ర"లో - మిశ్రమమైన విధానాన్ని అవలంబించాడు. - ప్రాఙ్నన్నయ యుగము, నన్నయ యుగము, తిక్కన యుగము, శ్రీనాధ యుగము, రాయల యుగము ఇలా..
 
==ప్రముఖ కవుల ననుసరించి==
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/339820" నుండి వెలికితీశారు