ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 154:
1851 మే 20 న, పెస్ట్‌లోని స్జెంట్ రోకస్ అనే ఒక చిన్న హాస్పిటల్లో ప్రసూతి వార్డ్ లో చిన్న, వేతనం లేని, గౌరవ ప్రధాన వైద్యుడి స్థానాన్ని సెమ్మెల్విస్ చేపట్టాడు. 1857 జూన్ వరకు అతను ఆరు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నాడు. ఆ క్లినిక్‌లో చైల్డ్ బెడ్ జ్వరం ప్రబలంగా ఉండేది{{sfnm|1a1=Semmelweis|1y=1983|p=107|2a1=Carter|2a2=Carter|2y=2005|2p=68}}; 1850 లో పెస్టుకు తిరిగి వచ్చిన వెంటనే, అతడు వైద్యశాలను సందర్శించడానికి వచ్చినప్పుడు, సెమ్మెల్విస్ అప్పుడే ఒక రోగి మరణించగా, మరొక రోగి తీవ్ర వేదనలో, ఇంకో నలుగురు ఈ వ్యాధితో తీవ్రంగా అనారోగ్యానికి గురి కాబడడాన్ని గమనించాడు. 1851 లో బాధ్యతలు స్వీకరించిన తరువాత, సెమ్మెల్విస్ ఈ వ్యాధిని దాదాపుగా నిర్మూలించాడు. 1851–1855 సమయంలో, 933 జననాలలో (0.85%) ఎనిమిది మంది రోగులు మాత్రమే చైల్డ్ బెడ్ జ్వరంతో మరణించారు{{sfn|Semmelweis|1983|pp=106–108}}.
 
అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ, బుడాపెస్టు లోని ఇతర ప్రసూతి వైద్యులు సెమ్మెల్విస్ ఉద్దేశ్యాలతో ఏకీభవించలేదు{{sfn|Carter|Carter|2005|p=69}}. పెస్ట్ విశ్వవిద్యాలయంలో ప్రసూతి శాస్త్ర అధ్యాపకుడు, ఈడ్ ఫ్లోరియన్ బిర్లీ ({{ill|Ede Flórián Birly|en}}), సెమ్మెల్విస్ యొక్క పద్ధతులను ఎప్పుడూ అవలంబించలేదు. ప్రేగు యొక్క అపరిశుభ్రత కారణంగా ప్యూర్పెరల్ జ్వరం వచ్చిందని{{sfn|Semmelweis|1983|p=24}}, అందువల్ల, భేది మందులతో విస్తృతమైన పేగు ప్రక్షాళనే ఈ వ్యాధికి తగిన చికిత్స అని అతను భావించేవారు.
 
1854 లో బిర్లీ మరణించిన తరువాత, సెమ్మెల్విస్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. సెమ్మెల్విస్ తోపాటు అతని చిరకాల ప్రత్యర్థి కార్ల్ బ్రాన్ కూడా ఆ కొలువుకు దరఖాస్తు చేసుకున్నాడు. బ్రాన్ తన హంగేరియన్ సహచరుల నుండి సెమ్మెల్వీస్ కంటే ఎక్కువ ఓట్లను పొందాడు. అయితే బ్రాన్ కు హంగేరియన్ భాష రాదు. అందుచేత వియన్నా అధికారులు ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి చివరికి 1855 లో ఆ స్థానాన్ని సెమ్మల్విస్ కు ఇచ్చారు. సెమ్మెల్వెస్ అధ్యాపక స్థానాన్ని చేపట్టగానే పెస్ట్ విశ్వవిద్యాలయ ప్రసూతి వార్డ్ లో క్లోరిన్ వాషింగ్‌ పద్దతిని అమలు చేసాడు. మరోసారి, ఫలితాలు ఆకట్టుకున్నాయి{{sfn|Carter|Carter|2005|p=69}}.