ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 168:
ఒక పాఠ్యపుస్తకంలో, మొదటి క్లినిక్‌లో సెమెల్‌వైస్ తరువాత సహాయకుడిగా నియమితుడైన కార్ల్ బ్రాన్, చైల్డ్బెడ్ జ్వరానికి 30 కారణాలను గుర్తించాడు; వీటిలో 28వ కారణంగా మాత్రమే శవకణాల సంక్రమణ పేర్కొనబడింది. ఇతర కారణాలు గర్భధారణ, యురేమియా, కుంచించుకుపోతున్న గర్భాశయం వలన ప్రక్కనే ఉన్న అవయవాలపై ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆహారంలో పొరపాట్లు, వాతావరణం మరియు అంటువ్యాధుల ప్రభావాలు.{{sfn|Braun|1857}}{{efn-ua|Carl Braun's thirty causes appear in his ''Lehrbuch der Geburtshülfe''. In the first of these, published in 1855, he mentions Semmelweis in connection with his discussion of cause number 28, cadaverous poisoning. In the later version, however, although he discusses the same cause in the same terms, all references to Semmelweis have been dropped.{{sfn|Semmelweis|1983|p=34*}}}} 1849 ఏప్రిల్ నుండి 1853 వేసవి వరకు బ్రాన్ సహాయకుడిగా ఉన్న మొదటి విభాగంలో మరణాల శాతం, దాదాపుగా సెమ్మల్వెస్ కాలంలో ఉన్నంతే ఉంది. దీన్ని బట్టి, సెమ్మల్వెస్ సిద్దాంతాన్ని వ్యతిరేకించినప్పటికీ, బ్రాన్ అతడి పద్దతులను కొనసాగించాడని తెలుస్తోంది.
 
జర్మన్ వైద్యులు మరియు [[ప్రకృతి శాస్త్రం|ప్రకృతి శాస్త్రవేత్తల]] సమావేశంలో, చాలా మంది వక్తలు అతని సిద్ధాంతాన్ని తిరస్కరించారు. వారిలో ఆ కాలపు అత్యున్నత శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్చో ({{ill|Rudolf Virchow|en}}) కూడా ఉన్నారు. వైద్య వర్గాలలో విర్చోకి ఉన్న పేరు, ప్రఖ్యాతలు సెమ్మెల్విస్ కు గుర్తింపు లభించకపోవడానికి ఒక ముఖ్య కారణం{{sfn|Hauzman|2006}}. సెమ్మెల్విస్ కు ముందు పెస్ట్ విశ్వవిద్యాలయంలో ప్రసూతి శాస్త్ర అధ్యాపకుడిగా ఉన్న ఈడ్ ఫ్లోరియన్ బిర్లీ, సెమ్మెల్విస్ బోధనలను ఎప్పుడూ అంగీకరించలేదు; అతను ప్రేగు అపరిశుభ్రత కారణంగా ప్యూర్పెరల్ జ్వరం వచ్చిందని గట్టిగా నమ్మేవాడు{{sfn|Semmelweis|1983|p=4}}. ప్రేగ్‌లోని ప్రసూతి వైద్యుడు ఆగస్టు బ్రీస్కీ, ({{ill|August Breisky|en}}) సెమ్మెల్‌వైస్ పుస్తకాన్ని "అజ్ఞానం" అని కొట్టిపారేసాడు. అతను దానిని "ప్రసవ భక్తి శాస్త్రానికి ఖురాన్"గా పేర్కొన్నాడు. ప్యూర్పెరల్ జ్వరం, పైయేమియా ఒకేలా ఉన్నాయని సెమ్మెల్విస్ నిరూపించలేదని బ్రీస్కీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కుళ్ళిపోతున్న జీవ పదార్థం కాక ఇతర కారకాలను కూడా కచ్చితంగా రోగకారకాలలో చేర్చవలసి ఉందని అతను బలంగా అభిప్రాయ పడ్డాడు{{sfnm|1a1=Semmelweis|1y=1983|1p=41|2a1=Breisky|2y=1861|2p=1}}.
 
కోపెన్‌హాగన్ ప్రసూతి ఆసుపత్రి అధిపతి కార్ల్ ఎడ్వర్డ్ మారియస్ లెవీ సెమ్మెల్‌వైస్ సిద్దాంతానికి ముఖ్య వ్యతిరేకుల్లో ఒకరు. నిర్దిష్ట గుణగుణాలు ఏవి లేని శవ కణాలు, అంత సూక్ష్మ మోతాదులలో వ్యాధి కారకాలుగా వ్యవహరిస్తాయి అనే సిద్దాంతం అతనికి సబబుగా అనిపించలేదు. అయితే, తరువాతి కాలంలో సరిగ్గా ఈ వాదనను ఉపయోగించే [[రాబర్ట్ కోచ్]] వ్యాధి కారక పదార్థాలు మానవ శరీరంలో పునరుత్పత్తి చేయగల శక్తి ఉన్న సూక్ష్మ జీవులను కలిగి ఉంటాయని నిరూపించారు. విషతుల్య వ్యాధికారక పదార్థాలు రసాయనాలు లేదా భౌతిక పదార్థాలో కాదు కాబట్టి అది జీవ పదార్థమే అయ్యుండాలని అతడి అభిప్రాయం{{sfn|Semmelweis|1983|p=183}}.