"ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
జర్మన్ వైద్యులు మరియు [[ప్రకృతి శాస్త్రం|ప్రకృతి శాస్త్రవేత్తల]] సమావేశంలో, చాలా మంది వక్తలు అతని సిద్ధాంతాన్ని తిరస్కరించారు. వారిలో ఆ కాలపు అత్యున్నత శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్చో ({{ill|Rudolf Virchow|en}}) కూడా ఉన్నారు. వైద్య వర్గాలలో విర్చోకి ఉన్న పేరు, ప్రఖ్యాతలు సెమ్మెల్విస్ కు గుర్తింపు లభించకపోవడానికి ఒక ముఖ్య కారణం{{sfn|Hauzman|2006}}. సెమ్మెల్విస్ కు ముందు పెస్ట్ విశ్వవిద్యాలయంలో ప్రసూతి శాస్త్ర అధ్యాపకుడిగా ఉన్న ఈడ్ ఫ్లోరియన్ బిర్లీ, సెమ్మెల్విస్ బోధనలను ఎప్పుడూ అంగీకరించలేదు; అతను ప్రేగు అపరిశుభ్రత కారణంగా ప్యూర్పెరల్ జ్వరం వచ్చిందని గట్టిగా నమ్మేవాడు{{sfn|Semmelweis|1983|p=4}}. ప్రేగ్‌లోని ప్రసూతి వైద్యుడు ఆగస్టు బ్రీస్కీ, ({{ill|August Breisky|en}}) సెమ్మెల్‌వైస్ పుస్తకాన్ని "అజ్ఞానం" అని కొట్టిపారేసాడు. అతను దానిని "ప్రసవ భక్తి శాస్త్రానికి ఖురాన్"గా పేర్కొన్నాడు. ప్యూర్పెరల్ జ్వరం, పైయేమియా ({{ill|Pyaemia|en}}) ఒకేలా ఉన్నాయని సెమ్మెల్విస్ నిరూపించలేదని బ్రీస్కీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కుళ్ళిపోతున్న జీవ పదార్థం కాక ఇతర కారకాలను కూడా కచ్చితంగా రోగకారకాలలో చేర్చవలసి ఉందని అతను బలంగా అభిప్రాయ పడ్డాడు{{sfnm|1a1=Semmelweis|1y=1983|1p=41|2a1=Breisky|2y=1861|2p=1}}.
 
కోపెన్‌హాగన్ ప్రసూతి ఆసుపత్రి అధిపతి కార్ల్ ఎడ్వర్డ్ మారియస్ లెవీ ({{ill|Carl Edvard Marius Levy|en}}) సెమ్మెల్‌వైస్ సిద్దాంతానికి ముఖ్య వ్యతిరేకుల్లో ఒకరు. నిర్దిష్ట గుణగుణాలు ఏవి లేని శవ కణాలు, అంత సూక్ష్మ మోతాదులలో వ్యాధి కారకాలుగా వ్యవహరిస్తాయి అనే సిద్దాంతం అతనికి సబబుగా అనిపించలేదు. అయితే, తరువాతి కాలంలో సరిగ్గా ఈ వాదనను ఉపయోగించే [[రాబర్ట్ కోచ్]] వ్యాధి కారక పదార్థాలు మానవ శరీరంలో పునరుత్పత్తి చేయగల శక్తి ఉన్న సూక్ష్మ జీవులను కలిగి ఉంటాయని నిరూపించారు. విషతుల్య వ్యాధికారక పదార్థాలు రసాయనాలు లేదా భౌతిక పదార్థాలో కాదు కాబట్టి అది జీవ పదార్థమే అయ్యుండాలని అతడి అభిప్రాయం{{sfn|Semmelweis|1983|p=183}}.
 
అప్పటి వైద్య సమాజ వ్యతిరేకతకు కఠినంగా, ఆక్రోశంతో ప్రతిస్పందించకుండా, సెమెల్వీస్ తన పరిశోధనలను మరింత సమర్థవంతంగా తెలియజేసుంటే, ఆ కాలంలో పాతుకుపోయిన నమ్మకాలకు విరుద్దంగా ఉన్నప్పటికీ, అతని సిద్దాంతాలు మరింత ప్రభావాన్ని చూపగలిగేవని ఒక ఉవాచ{{sfn|Nuland|2003}}.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3400417" నుండి వెలికితీశారు