"ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
1861 నుండి, సెమ్మెల్విస్ వివిధ మానసిక రుగ్మతలకు గురయ్యాడు. అతను తీవ్ర మానసిక నిస్పృహకు గురై, ఎప్పుడూ అన్యమనస్కంగా ఉండేవాడు. 1857 నుండి 1864 వరకు అతని చిత్రాల్లో వృద్ధాప్యం యొక్క పురోగతిని చూడవచ్చు{{efn-ua|Paintings of Semmelweis available in the 1983 edition of his ''Etiology, Concept and Prophylaxis of Childbed Fever'',{{sfn|Semmelweis|1983|p=57}} and at [[Commons:Category:Ignaz Semmelweis|Wikimedia Commons]].}}. అతను ప్రతి సంభాషణను చైల్డ్బెడ్ జ్వరం విషయం వైపే మళ్ళించేవాడు.
 
తన 1861 పుస్తకానికి అనేక అననుకూల విదేశీ సమీక్షల తరువాత, సెమ్మెల్విస్ తన విమర్శకులపై వరుస బహిరంగ ఉత్తరాలలో విరుచుకుపడ్డాడు{{efn-ua|The 1862 open letter is available at the {{URL|1=http://www.literature.at/viewer.alo?viewmode=overview&objid=13184&page= |2=Austrian national library}} website.}}. అవి స్పాత్ ({{ill|Joseph Späth|en}}), స్కాన్ౙొని ({{ill|Friedrich Wilhelm Scanzoni von Lichtenfels|en}}), సైబోల్డ్ ({{ill|Eduard Caspar Jacob von Siebold|en}}) లతో సహా అనేక ప్రముఖ ఐరోపా ప్రసూతి వైద్యులతో పాటు ప్రసూతి వైద్యులందరికీ ఉద్దేశించి వ్రాయబడేవి{{sfn|Semmelweis|1983|p=57}}. ఆవేశోద్రేకంతో, ఆక్రోశంతో నిండి ఉండే ఆ లేఖల్లో అతను వారందరిని బాగా తూర్పారబట్టి, తీవ్రంగా కించపరిచేవాడు. అతను కొన్ని సార్లు అతని విమర్శకులను బాధ్యతా రహితమైన హంతకులుగా, అజ్ఞానులుగా పేర్కొనేవాడు{{sfn|Carter|Carter|2005|p=73}}{{sfn|Semmelweis|1983|p=41}}. జర్మన్ ప్రసూతి వైద్యులనందరినీ సమావేశపరిచి, ప్యూర్పెరల్ జ్వరంపై చర్చాగోష్టి ఏర్పాటు చేయాలని సెమ్మల్వెస్ సిబోల్ట్‌కు పిలుపునిచ్చారు. అక్కడ "అందరూ తన సిద్ధాంతాన్ని ఒప్పుకునే వరకు" అక్కణ్ణుంచి కదలనని అనేవారు{{sfn|Hauzman|2006}}.
 
1865 సంవత్సర మధ్యభాగానికి, అతని సామాజిక ప్రవర్తన అతని సహచరులకు ఇబ్బందికరంగా, విసుగెత్తించేలా తయారైంది. అతను కూడా మితిమీరిన మద్యపానానికి అలవాటు పడి; క్రమంగా తన కుటుంబం నుండి దూరంగా ఎక్కువ సమయం గడిపసాగాడు. కొన్నిసార్లు వేశ్యలతో గడిపేవాడు; అతని భార్య కూడా అతని లైంగిక ప్రవర్తనలో మార్పులను గమనించింది. 1865 జూలై 13 న, సెమ్మెల్విస్ కుటుంబం స్నేహితులను సందర్శించింది. ఆ సమయంలో సెమ్మెల్విస్ ప్రవర్తన వారందరికీ మరీ అభ్యంతరకరంగా అనిపించింది{{sfn|Carter|Carter|2005|p=74}}.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3400421" నుండి వెలికితీశారు