"ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
అప్పటి వైద్య సమాజం యొక్క ఉదాసీనతపై కోపోద్రిక్తుడైన సెమ్మెల్విస్ ప్రముఖ యూరోపియన్ ప్రసూతి వైద్యులకు కఠిన స్వరంలో బహిరంగ లేఖలు రాయడం ప్రారంభించాడు. వారిని బాధ్యతారహిత హంతకులుగా పేర్కొన్నాడు. అతని భార్యతో సహా, అతని సమకాలీకులందరు అతనికి మతి భ్రమించిందని భావించారు. 1865లో అతనిని లాండెసిరెనన్‌స్టాల్ట్ డోబ్లింగ్ (ప్రాంతీయ మతిస్థిమితం లేనివారి ఆశ్రయం) లో చేర్చారు. అక్కడ చేర్చిన 14 రోజుల తరువాత సెప్టిక్ షాక్‌తో మరణించాడు. సెప్టిక్ షాక్ కు కారణం బహుశా భద్రతా సిబ్బందిచే తీవ్రంగా కొట్టబడటం కావచ్చు.
అతను మరణించిన కొన్ని సంవత్సరాలకు లూయిస్ పాశ్చర్ [[వ్యాధి సూక్ష్మక్రిమి సిద్ధాంతాతం|వ్యాధి సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని]] అభివృద్ధి చేసి, సెమ్మెల్వీస్ పరిశోధనలకు సైద్ధాంతిక వివరణను అందించిన తరువాతే అతడి పరిశోధనలకు గుర్తింపు లభించింది. అతను క్రిమినాశక ప్రక్రియల యొక్క మార్గదర్శకుడిగా పరిగణించబడ్డాడు.
=== నిరూపించినఆనాటి వైద్య అభిప్రాయంతోఅభిప్రాయాలతో విభేదాలు ===
[[దస్త్రం:Monthly_mortality_rates_1841-1849.png|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Monthly_mortality_rates_1841-1849.png|thumb|500x500px|{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} [[Historical mortality rates of puerperal fever#Monthly mortality rates for birthgiving women 1841%E2%80%931849| ]].1841–49 మధ్యకాలంలో వియెన్న ప్రసూతి సంస్థలోని మొదటి క్లినిక్లో ప్యుర్పెరల్ ఫీవర్ వ్యాధిగ్రస్తుల నెలవారీ మరణశాతాలు. 1847 మే మధ్యభాగంలో సెమ్మల్వెస్ క్లోరిన్ వాషింగ్ పద్దతిని అమలు చేసినప్పుడు గణాంకాలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది]]
సెమ్మెల్విస్ పరిశీలనలు ఆ సమయంలో ఆమోదించబడిన శాస్త్రీయ, వైద్య అభిప్రాయాలతో విభేదించాయి. ఆ కాలంలో శరీరంలోని ప్రాథమిక "నాలుగు దేహరసాల" అసమతుల్యత ({{ill|Humorism|en}}) ఆధారంగా వ్యాధి సిద్ధాంతం సూత్రీకరించబడింది. దీనిని ''డిస్క్రాసియా'' ({{ill|dyscrasia|en}}) అని పిలుస్తారు. దీనికి ముఖ్య చికిత్స రోగి నుండి రక్తం బయటకు తీయడం ({{ill|Bloodletting|en}}). ఆ సమయంలో వైద్య గ్రంథాలు ప్రతి వ్యాధి ప్రత్యేకమైనదని, వ్యక్తిగత అసమతుల్యత యొక్క ఫలితం అని, వైద్య విధానంలో కష్టమైన భాగం ప్రతి రోగి యొక్క ప్రత్యేక పరిస్థితిని కచ్చితంగా అంచన వేయడం అని నొక్కిచెప్పేవి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3400477" నుండి వెలికితీశారు