"ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
== చైల్డ్బెడ్ ఫీవర్ పై పరిశోధనలు==
1846 జూలై 1 {{sfn|Benedek|1983|p=72}}{{sfnm|1a1=Semmelweis|1y=1983|1p=34|2a1=Schmidt|2y=1850|2p=501}}{{efn-ua|సెమ్మల్వెస్ 1844 జులై 1న, వియెన్న ప్రసూతి క్లినిక్ లో వైద్య సహాయకుడిగా (జర్మన్ భాషలో ''ఆస్పిరెంట్ అసిస్టెంటర్ౙ్టెస్ అన్ డెర్ వ్యెనెర్ గెబర్ట్షిల్ఫ్లిచెన్ క్లినిక్'' ) శిక్షణ ప్రారంభించారు. 1846 జులై 1న శిక్షణ పూర్తి చేసుకుని వైద్య సహాయకుడిగా (జర్మన్: ఆర్డెంట్లిచెర్ అసిస్టెంటార్ౙ్ట్) నియమించబడ్డారు. అయితే 1846 అక్టోబర్ 20న, తనకంటే ముందు ఆ స్థానంలో ఉన్న డా. ఫ్రాంౙ్ బ్రైట్ ({{ill|Franz Breit|en}}) అనుకోకుండా ఆసుపత్రి కి తిరిగి రావడంతో అతడిని క్రింది స్థానానికి పరిమితం చేసి, బ్రైట్ ను వైద్య సహాయకుడిగా నియమించడం జరిగింది. 1847 మార్చి 20న, డా. బ్రైట్ టూబింజెన్ లో అధ్యాపకునిగా చేరడంతో సెమ్మల్వెస్ మళ్ళీ సహాయకునిగా బాధ్యతలు చేపట్టారు. {{sfn|Benedek|1983|p=72}}}}న వియన్నా జనరల్ హాస్పిటల్ మొదటి ప్రసూతి క్లినిక్‌లో ప్రొఫెసర్ జోహన్ క్లైన్‌కు ({{ill|Johann Klein|en}}) సహాయకుడిగా సెమ్మెల్విస్ నియమించబడ్డాడు. ఇది నేటి యునైటెడ్ స్టేట్స్ ఆసుపత్రులలో "చీఫ్ రెసిడెంట్"{{sfn|Carter|Carter|2005|p=56}} స్థానం లాంటిదని చెప్పవచ్చు. ప్రొఫెసర్ రౌండ్లలో ప్రతి ఉదయం రోగులను పరీక్షించడం, కష్టమైన ప్రసవాలను పర్యవేక్షించడం, ప్రసూతి శాస్త్ర విద్యార్థులకు బోధించడం, రికార్డుల "గుమస్తా"గా ఉండటం అతని విధులు.
 
అక్రమ సంతాన శిశుహత్యల ({{ill|infanticide|en}}) సమస్యను పరిష్కరించడానికి ఐరోపా అంతటా ప్రసూతి సంస్థలను ఏర్పాటు చేయబడ్డాయి. ఉచిత సంస్థలు కావడంతో వేశ్యలతో సహా ఇతర అణగారిన మహిళలకు ఇవి ఆకర్షణీయంగా మారాయి. ఉచిత సేవలకు బదులుగా, వైద్యులు, మంత్రసానుల శిక్షణకు మహిళలు బోధనాంశంగా ఉండేవారు. రెండు ప్రసూతి క్లినిక్‌లు వియన్నా ఆసుపత్రిలో ఉన్నాయి. ప్యూర్పెరల్ జ్వరం కారణంగా మొదటి క్లినిక్‌లో సగటు తల్లుల మరణాలు 10% కాగా రెండవ క్లినిక్ లో సగటు గణనీయంగా తక్కువ అనగా 4% కన్నా తక్కువ ఉండేది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఒక రోజుకు ఒక క్లినిక్ చొప్పున రెండు క్లినిక్‌లు వంతులు వేసుకుని రోజు మార్చి రోజు రోగులను చేర్చుకునేవి. కానీ మొదటి క్లినిక్ కు గల చెడ్డ పేరు కారణంగా మహిళలు రెండవ క్లినిక్‌లోనే చేరతామని వేడుకునేవారు{{sfn|Semmelweis|1983|p=69}}. మొదటి క్లినిక్‌లో చేర్చవద్దని కొంతమంది మహిళలు మోకరిల్లి వేడుకునేవారని సెమ్మెల్వీస్ పేర్కొన్నాడు{{sfn|Semmelweis|1983|p=70}}. కొందరు మహిళలు అయితే వీధుల్లో ప్రసవించి, ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఆకస్మిక ప్రసవమైనట్లు నటిస్తుండేవారు. ఎందుకంటే ఆకస్మికంగా ప్రసవించిన తల్లులు క్లినిక్‌లో చేరనప్పటికీ పిల్లల సంరక్షణ ప్రయోజనాలను పొందడానికి అర్హులు. వీధి ప్రసవాలు చేయించుకునే మహిళల్లో ప్యూర్పెరల్ జ్వరం చాలా అరుదు అని గమనించిన సెమ్మెల్విస్ అవాక్కయ్యాడు. "నాకు హేతుబద్దంగా ఆలోచిస్తే వీధి ప్రసవాలకు గురైన మహిళలు కనీసం క్లినిక్‌లో ప్రసవించిన వారితో సమానంగా అయినా అనారోగ్యానికి గురవ్వాలి కదా అనిపించింది. [...] క్లినిక్ వెలుపల ప్రసవించిన వారిని ఈ తెలియని విధ్వంసకరమైన స్థానిక ప్రభావాల నుండి రక్షిస్తున్నది ఏమిటి?"{{sfn|Semmelweis|1983|p=81}} అని ఆలోచించాడు. [[దస్త్రం:Semmelweis_statue.jpg|thumb|[[టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో సెమ్మల్విస్ విగ్రహం]]]]రెండవ క్లినిక్ కంటే ప్యూర్పెరల్ జ్వరం కారణంగా తన మొదటి క్లినిక్లో మరణాల శాతం చాలా ఎక్కువగా ఉందని సెమ్మెల్విస్ చాలా బాధపడ్డాడు. ఇది "నన్నెంత కలవరపాటుకు గురి చేసిందంటే జీవితం నిష్ప్రయోజకంగా అనిపించింది". రెండు క్లినిక్‌లు దాదాపు ఒకే పద్ధతులను ఉపయోగించాయి. సెమ్మెల్విస్ మతపరమైన పద్ధతులతో సహా అన్ని తేడాలను పరిశీలించడం ప్రారంభించాడు. చివరికి అతని పరిశీలనలో తేలింది ఏమిటంటే అక్కడ పనిచేసే వ్యక్తులు మాత్రమే చెప్పుకోదగ్గ తేడా అని. మొదటి క్లినిక్ వైద్య విద్యార్థులకు బోధనా సేవకు కాగా, రెండవ క్లినిక్ 1841 లో మంత్రసానుల బోధన కోసం మాత్రమే ఎంపిక చేయబడింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3400588" నుండి వెలికితీశారు