కేదారేశ్వర వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

→‎అధసూత్ర గ్రంధిపూజ: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 281:
==శ్రీ కేదారేశ్వర వ్రత కథ==
 
పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను., శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను.
 
శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని యుండెను. సిద్ధ - సాధ్య - కింపురుష - యక్ష - గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించు చుండిరి. ఋషులు - మునులు - అగ్ని - వాయువు - వరుణుడు - సూర్యచంద్రులు - తారలు - గ్రహాలు - ప్రమదగణాలు - కుమారస్వామి - వినాయకుడు - వీరభద్రుడు - నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల - సాల - తమలా - వకుళ - నరికేళ - చందన - పనస - జంభూ వృక్షములతోను చంపక - పున్నాగ - పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశ భువనాలు పులకిస్తున్నాయి.