వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

1,189 బైట్లు చేర్చారు ,  6 నెలల క్రితం
ట్యాగు: 2017 source edit
 
దయచేసి గమనించండి ఈనాడు కథనం ఇండిక్ వికీ ప్రాజెక్టు నుండి వచ్చింది కాదు, అంతే కాక యూఆర్‌ఎల్ విషయం లో తెలుగు వికీపీడియా అంటే tewiki . iiii . ac .in అనే ఎటువంటి అధికార ప్రకటన గానీ చేయలేదు, ఈనాడు వార్తలో వ్యాసాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ అని మాత్రమే ప్రస్తావించాము , వీలయితే ఒకసారి [https://web.archive.org/web/20211114151859/https://www.eenadu.net/tsmukyamshalu/mainnews/general/26/121063959 ఈనాడు వార్త] చదవండి, అది మేము ఇచ్చే శిక్షణలో భాగంగా అందరికీ తెలియచేసున్నాము, ఇంకో విషయం కొత్త వారు పొరపాటు పడకుండా మొదటి పేజీలోనే ఎప్పటినుండో సూచన ఏర్పాటు చేశాము. మేము ఇచ్చిన ప్రతి సమావేశం శిక్షణా తరగతిలోనూ మా ప్రయోగశాల పరిమితులు, ఇందులో వ్యాసాలు రాయటం అలవాటు అయినతరువాత తెలుగు వికీపీడియాలో చేరే విధానం చెపుతాము ఈ విషయంలో గౌరవ సభ్యులు ఎవరితో నైనా తనిఖీ చేసుకోవచ్చు
[[దస్త్రం:TeWiki iiit Homepage 2021-11-16 125857.png|thumb|తెలుగు వికీపీడియా గురించి అవగాహన పొందుటకు ఐఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రయోగశాల (SANDBOX)]]
నాకు తెలిసి మీరు చెప్పిన విధంగా [[google:telugu+wikipedia&biw=1280&bih=563&tbm=nws&sxsrf=AOaemvKvUR8Y7yErbHVIZIgqVYho0gUY2A:1637048934887&ei=ZmKTYdS2NfXc2roP6t698AI&oq=telugu+wikipedia&gs_l=psy-ab.3...0.0.0.4908.0.0.0.0.0.0.0.0..0.0....0...1c..64.psy-ab..0.0.0....0.iLh5mjplsFU|తెలుగు వికీపీడియా యూఆర్‌ఎల్‌కు బదులుగా ఇండిక్ వికీ వారి యూఆర్‌ఎల్‌]] గా ప్రాజెక్టు నుండి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు,చేయబోము !
* తెలుగు వికీపీడియా సదస్సు 2020 అన్నది ఫిబ్రవరి 8వ తేదీన జరిగింది. మీరు తెలుగు వికీపీడియా రచ్చబండలో 4వ తేదీన "తెలియపరిచారు". మీరు ఒక వారం రోజుల ముందు, నాలుగు రోజుల మందు వికీపీడియా సముదాయంలో తెలియపరుస్తున్నారు. వికీపీడియాలో ప్రణాళిక పెట్టి చర్చకు ఆహ్వానించడం లేదు. మీరు ఇచ్చిన లింకులో చూసినా '''2020 ఫిబ్రవరి 9వ తేదీన [[వాడుకరి:Pranayraj1985|ప్రణయ్ రాజ్]] మీరు ఇచ్చిన లింకులోనే "ఐఐఐటీ ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలకోసం తెవికీలో ఉన్న ఐఐఐటీ ప్రాజెక్టు పేజీకి ఉప పేజీలను పెట్టి అందులో ఆయా కార్యక్రమ ముందస్తు వివరాలు, కార్యక్రమం అయిపోయిన తరువాత ఫోటోలతో కార్యక్రమ నివేదికను రాయండి. ఇలా చేయడంవల్ల ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న కార్యక్రమాల విషయాలు ఇతర వికీపీడియన్లకు, మిగతా వారికి తెలుస్తాయి. ఈ విషయంలో మీకు సహకారం అందించడానికి తెవికీ సభ్యులు అందుబాటులో ఉంటారు." అని అక్కడే రాశారు. కనీసం అక్కడ ఏ ప్రతిస్పందన లేదు, మళ్ళీ అదే పద్ధతిలో ముందుకుపోతున్నారు. ఎందుకని ఇదంతా ఉపేక్షిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి మేం ఒకటే చెప్తున్నాం - తెలుగు వికీపీడియన్లు ఒకరిద్దరం పాల్గొన్నంత మాత్రాన, సముదాయం అంతటికీ తెలిసేలా కనీసం ఒకటి, రెండు వారాల వ్యవధి ఇచ్చి వికీపీడియా రచ్చబండలో చర్చకు పెట్టకపోతే తెలుగు వికీపీడియా సముదాయం పాల్గొన్నట్టు కాదు. నేను అదే విషయం ఇప్పటికి రెండు సార్లు రాశాను పైన. మళ్ళీ మీరు "తెలియపరిచాము", "ప్రస్తావించాము" అంటున్నారు.''' --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:43, 17 నవంబరు 2021 (UTC)
*:సదస్సు నివేదిక ను ప్రాజెక్టు పేజీలో ప్రచురించాము [[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన#తెలుగు వికీపీడియా - 2020 సదస్సు నివేదిక|ఇక్కడ చూడండి]] ఇక మీరు రచ్చబండలో చర్చకు పెట్టకపోతే తెలుగు వికీపీడియా సముదాయం పాల్గొన్నట్టు కాదు అని చెప్పారు,గతంలో చాలా కార్యక్రమాలు,శిక్షణా ప్రాజెక్టులు రచ్చబండలో చర్చలు లేకుండానే జరిగినవి అన్న విషయం కూడా గమనించగలరు, అయినా కూడా మేము నిర్వహించే స్వతంత్ర కార్యక్రమాల మీద రచ్చబండలో తెలియచేస్తూనే ఉన్నాం ఇందులో భాగంగా ఏదైనా ప్రత్యేక సహకారం కోసం సంబంధిత వికీ సభ్యులతో నేరుగా సంప్రదిస్తున్నాం. లోగోలు,పేర్లు,భాగస్వామ్యం ఇతర అంశాల మీద హక్కుదారులు అయిన వికీ ఫౌండేషన్ వారితో సంప్రదించాము, రాబోయే కార్యక్రమం [https://indicwiki.iiit.ac.in/summit2021/ వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్ 2021] కూడా మీడియావికీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నాం. [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 05:37, 17 నవంబరు 2021 (UTC)
 
"మేము ఇచ్చిన ప్రతి సమావేశం శిక్షణా తరగతిలోనూ మా ప్రయోగశాల పరిమితులు, ఇందులో వ్యాసాలు రాయటం అలవాటు అయినతరువాత తెలుగు వికీపీడియాలో చేరే విధానం చెపుతాము ఈ విషయంలో గౌరవ సభ్యులు ఎవరితో నైనా తనిఖీ చేసుకోవచ్చు"---ఈ వ్యాఖ్యకు నా స్పందన--- ఈ ప్రాజెక్టులో మొదటి విడత ట్రైనింగ్ ఇచ్చింది నేనే. ఇక్కడ ప్రస్తావించినట్టు వాడుకరులకు వికీపీడియాలో చేరే విధానం ఎప్పుడూ చెప్పలేదు. దృష్టి అంతా iiit మీదే ఉంది. [[వాడుకరి:Svpnikhil|Svpnikhil]] ([[వాడుకరి చర్చ:Svpnikhil|చర్చ]]) 08:34, 17 నవంబరు 2021 (UTC)
 
== తెలుగు వికీపీడియా జన్మదినోత్సవం - 2021 ==
523

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3401078" నుండి వెలికితీశారు