ఇగ్నాజ్ సెమెల్‌వెయ్స్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 166:
1856 లో, సెమ్మెల్విస్ సహాయకుడు జోసెఫ్ ఫ్లీషర్ వియన్నా వైద్య వార పత్రికలో (వీనర్ మెడిజినిస్చే వోచెన్‌స్క్రిట్ ({{ill|Wiener Medizinische Wochenschrift|en}})) లో సెయింట్ రోచస్, పెస్ట్ ప్రసూతి సంస్థలలో సెమ్మల్వెస్ పద్దతుల యొక్క అద్భుత ఫలితాలను ప్రచూరించాడు{{sfn|Carter|Carter|2005|p=69}}. ఈ వ్యాసం పై స్పందిస్తూ, ఆ పత్రిక సంపాదకుడు ప్రజలు క్లోరిన్ వాషింగ్ సిద్ధాంతంతో దారి మళ్ళడం మానుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండు సంవత్సరాల తరువాత, సెమ్మెల్విస్ చివరకు "ది ఎటియాలజీ ఆఫ్ చైల్డ్బెడ్ ఫీవర్" (అనువా: చైల్డ్బెడ్ ఫీవర్ కు కారణం) అనే వ్యాసంలో తన పరిశోధనల గురించి తన స్వంత అభిప్రాయలను ప్రచురించాడు{{efn-ua|ఆ వ్యాసం "''A gyermekágyi láz kóroktana''" ("చైల్డ్బెడ్ ఫీవర్ రోగకారకం"). ''Orvosi hetilap'' '''2''' (1858) లో ప్రచురించబడింది. టిబెర్యస్ వాన్ గ్యోరి వ్రాసిన ''Semmelweis's gesammelte Werke'' (Jena: Gustav Fischer, 1905), 61–83 లో ఈ వ్యాస జర్మన్ అనువాదం ఉంది. ఇది ప్యుర్పెరల్ ఫీవర్ పై సెమ్మెల్వెస్ మొదటి రచన. గ్యోరి ప్రకారం ఈ వ్యాస సారాంశాన్ని 1858 శరదృతువు లో ''Budapester Königliche Ârzteverein'' లో సెమ్మెల్విస్ ఉపన్యసించారు. {{sfn|Semmelweis|1983|p=112}}}}. ఇంకో రెండు సంవత్సరాల తరువాత, అతను "ద డిఫెరెన్స్ ఇన్ ఒపీనియన్ బెట్వీన్ మైసెల్ఫ్ అండ్ ద ఇంగ్లీష్ ఫిజీషియన్స్ రిగార్డింగ్ చైల్డ్‌బెడ్ ఫీవర్" (అనువా: చైల్డ్‌బెడ్ ఫీవర్ విషయంలో నాకు, ఆంగ్ల వైద్యులకు మధ్య అభిప్రాయ భేదాలు) అనే రెండవ వ్యాసాన్ని ప్రచురించాడు{{efn-ua|వ్యాస ప్రచురణ వివరాలు: Ignaz Philipp Semmelweis, "A gyermekágyi láz fölötti véleménykülönbség köztem s az angol orvosok közt" Orvosi hetilap '''4''' (1860), 849–851, 873–876, 889–893, 913–915.{{sfn|Semmelweis|1983|p=24}}}}. 1861 లో, సెమ్మెల్విస్ చివరకు తన ప్రధాన రచన "డై ఎటియోలాజీ, డెర్ బెగ్రిఫ్ ఉండ్ డై ప్రొఫిలాక్సిస్ డెస్ కిండ్‌బెట్‌ఫైబర్స్" (అనువా: చైల్డ్‌బెడ్ ఫీవర్ రోగ కారణాలు, వివరణ మరియు నివారణ) ప్రచురించాడు{{efn-ua|[http://real-eod.mtak.hu/2450/ Digital copy of Semmelweis' book]}}. 1861లో ప్రచురించిన తన పుస్తకంలో, సెమ్మెల్విస్ తన పద్దతులు అవలంబించడం పట్ల అప్పటి వైద్య సంఘ ఉదాసీనత పై విచారం వ్యక్తం చేసాడు: "చైల్డ్బెడ్ ఫీవర్ పై జరిగే అనేక వైద్యవిద్య బోధనా తరగతులు ఇప్పటికీ నా సిద్దాంతాన్ని వ్యతిరేకించే విశ్లేషణలతో మార్మోగుతున్నాయి. [...] ప్రచురించిన వైద్య రచనలలో నా బోధనలు విస్మరించబడ్డాయి లేదా ఖండించబడ్డాయి. వర్జ్‌బర్గ్‌లోని వైద్య అధ్యాపకులు 1859 లో రాసిన ఒక వ్యాసానికి బహుమతిని ప్రదానం చేశారు. ఇందులో నా బోధనలు ఖండించబడ్డాయి ".{{sfn|Semmelweis|1983|p=169}}{{efn-ua|సెమ్మల్వెస్ చెబుతున్న వ్యాసం ఎరెలాంగన్ ({{ill|Erlangen|en}})లో 1859లో ప్రచురించబడింది. దీన్ని వ్రాసిన వారు హైన్రిక్ సిల్బర్ష్మిడ్ట్. ఇందులో సెమ్మల్వెస్ ప్రస్తావన ఉన్నప్పటికీ అతని పరికల్పనను గురించి ఈ వ్యాసం వివరాల్లోకి వెళ్ళలేదు. వ్యాస ప్రచురణ వివరాలు: "Historisch-kritische Darstellung der Pathologie des Kindbettfiebers von den ältesten Zeiten bis auf die unserige". ఫ్రెడ్రిక్ విల్హెల్మ్ స్కాన్ౙొని వాన్ లిక్టెన్ఫెల్స్ ({{ill|Friedrich Wilhelm Scanzoni von Lichtenfels|en}}) ప్రోద్బలంతో వూర్ౙ్బర్గ్ లోని వైద్య అధ్యాపకులు ఈ వ్యాసానికి బహుమతిని ఇచ్చారు.{{sfnm|1a1=Hauzman|1y=2006|2a1=Semmelweis|2y=1983|2p=212}}}}
[[దస్త్రం:Yearly_mortality_rates_1784-1849.png|thumb|321x321px|1861లో వ్రాసిన తన పుస్తకంలో సెమ్మల్వెస్, 1823లో వియెన్ (వియెన్న)లో శవపరీక్షలు మొదలుపెట్టడంతో (నిలువు గీత) ప్రాణాంతక చైల్డ్బెడ్ ఫీవర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిందనడానికి ఆధారాలను పొందుపరిచాడు. రెండవ నిలువు గీత 1847లో క్లోరిన్ హ్యాండ్ వాషింగ్ పద్దతిని అమలు చేయడాన్ని సూచిస్తుంది. పోలికకై శవపరీక్షల సౌలభ్యం లేని డుబ్లిన్ లోని రొటుండ ప్రసూతి ఆసుపత్రి ({{ill|Rotunda Hospital|en}}) గణాంకాలు ఇవ్వబడ్డాయి [[Historical mortality rates of puerperal fever#Yearly mortality rates for birthgiving women 1784–1849| ]]]]
ఒక పాఠ్యపుస్తకంలో, మొదటి క్లినిక్‌లో సెమెల్‌వైస్ తరువాత సహాయకుడిగా నియమితుడైన కార్ల్ బ్రాన్, చైల్డ్బెడ్ జ్వరానికి 30 కారణాలను గుర్తించాడు; వీటిలో 28వ కారణంగా మాత్రమే శవకణాల సంక్రమణ పేర్కొనబడింది. ఇతర కారణాలు గర్భధారణ, యురేమియా, కుంచించుకుపోతున్న గర్భాశయం వలన ప్రక్కనే ఉన్న అవయవాలపై ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఆహారంలో పొరపాట్లు, వాతావరణం మరియు అంటువ్యాధుల ప్రభావాలు.{{sfn|Braun|1857}}{{efn-ua|Carl Braun's30 thirtyకారణాలు causesబ్రాన్ appearవ్రాసిన in hisపుస్తకం ''Lehrbuch der Geburtshülfe''. Inలో theపేర్కొనబడ్డాయి. first1855లో ofప్రచురితమైన these,సంచికలో శవకణాల publishedకారణం inగురించి 1855వివరిస్తూ, heసెమ్మల్వెస్ mentionsపేరు Semmelweis in connection with his discussion of cause number 28, cadaverous poisoningప్రస్తావించబడింది. Inతరువాతి theసంచికల్లో laterకూడా version,వివరణ however,పొల్లు althoughపోకుండా heఅదే discusses the same cause in the same termsఅయినప్పటికీ, all references to Semmelweis haveసెమ్మల్వెస్ beenమాత్రం droppedప్రస్తావించబడలేదు.{{sfn|Semmelweis|1983|p=34*}}}} 1849 ఏప్రిల్ నుండి 1853 వేసవి వరకు బ్రాన్ సహాయకుడిగా ఉన్న మొదటి విభాగంలో మరణాల శాతం, దాదాపుగా సెమ్మల్వెస్ కాలంలో ఉన్నంతే ఉంది. దీన్ని బట్టి, సెమ్మల్వెస్ సిద్దాంతాన్ని వ్యతిరేకించినప్పటికీ, బ్రాన్ అతడి పద్దతులను కొనసాగించాడని తెలుస్తోంది.
 
జర్మన్ వైద్యులు మరియు [[ప్రకృతి శాస్త్రం|ప్రకృతి శాస్త్రవేత్తల]] సమావేశంలో, చాలా మంది వక్తలు అతని సిద్ధాంతాన్ని తిరస్కరించారు. వారిలో ఆ కాలపు అత్యున్నత శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్చో ({{ill|Rudolf Virchow|en}}) కూడా ఉన్నారు. వైద్య వర్గాలలో విర్చోకి ఉన్న పేరు, ప్రఖ్యాతలు సెమ్మెల్విస్ కు గుర్తింపు లభించకపోవడానికి ఒక ముఖ్య కారణం{{sfn|Hauzman|2006}}. సెమ్మెల్విస్ కు ముందు పెస్ట్ విశ్వవిద్యాలయంలో ప్రసూతి శాస్త్ర అధ్యాపకుడిగా ఉన్న ఈడ్ ఫ్లోరియన్ బిర్లీ, సెమ్మెల్విస్ బోధనలను ఎప్పుడూ అంగీకరించలేదు; అతను ప్రేగు అపరిశుభ్రత కారణంగా ప్యూర్పెరల్ జ్వరం వచ్చిందని గట్టిగా నమ్మేవాడు{{sfn|Semmelweis|1983|p=4}}. ప్రేగ్‌లోని ప్రసూతి వైద్యుడు ఆగస్టు బ్రీస్కీ, ({{ill|August Breisky|en}}) సెమ్మెల్‌వైస్ పుస్తకాన్ని "అజ్ఞానం" అని కొట్టిపారేసాడు. అతను దానిని "ప్రసవ భక్తి శాస్త్రానికి ఖురాన్"గా పేర్కొన్నాడు. ప్యూర్పెరల్ జ్వరం, పైయేమియా ({{ill|Pyaemia|en}}) ఒకేలా ఉన్నాయని సెమ్మెల్విస్ నిరూపించలేదని బ్రీస్కీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కుళ్ళిపోతున్న జీవ పదార్థం కాక ఇతర కారకాలను కూడా కచ్చితంగా రోగకారకాలలో చేర్చవలసి ఉందని అతను బలంగా అభిప్రాయ పడ్డాడు{{sfnm|1a1=Semmelweis|1y=1983|1p=41|2a1=Breisky|2y=1861|2p=1}}.