వి.వి.యెస్.లక్ష్మణ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
==ఇటీవలి ఆటతీరు==
కాని లక్ష్మణ్ ఆటతీరు ఆస్ట్రేలియా పర్యటన నుండి తగ్గుతూ వచ్చింది. [[2004]] [[మార్చి]] లో పాకిస్తాన్ పర్యటన నుండి [[జింబాబ్వే]]( ఐసిసి ర్యాంకింగ్స్ లో చివరి స్థానం లో ఉన్న దేశము) తో సాధించిన ఒక సెంచరీ తో సహా కేవలము మూడు సెంచరీలు మాత్రమే సాధించాడు. అతను తన [[2004]] లో అభిమాన ఆస్ట్రేలియా తో మన దేం లో జరిగిన సీరీస్ లో ముంబయి లో జరిగిన టెస్ట్ లో 69 పరుగులు సాధించినా చాలా తడబడ్డాడు. ఆ టెస్ట్ భారత్ గెలిచినప్పటికి సిరీస్ కోల్పోయింది. ముంబయి లో మార్చ్ [[2006]] లో [[ఇంగ్లాండు]] తో మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ సున్నా పరుగులు చేసి స్థానము కోల్పోయాడు. తిరిగి గాయము కారణము గా సచిన్ గైర్హాజరీ కారణము గా [[వెస్టిండీస్]] పర్యటన లో స్థానము సాధించి మూడవ టెస్ట్ లో శతకము సాధించాడు. [[గ్రెగ్ ఛాపెల్]] [[2005]] లో కోచ్ గా వచ్చిన తర్వాత లక్ష్మణ్ యొక్క నాశిరకం ఫీల్డింగ్, అతని ఆటతీరు వన్డే లకు సరిపోకపోవడం వలన వన్డే ల నుండి తొలగింపబడ్డాడు. ఇది 2004 మొదట్లో ఆస్ట్రేలియా,పాకిస్తాన్ లతో 14 గేములలో 4 శతకాలు, ఆస్ట్రేలియా తో ఒకే వారము లో విబి సీరీస్ లో సాధించిన 3 సెంచరీలు కలుపుకుని, మరుగునపరిచింది. [[నవంబరు]] [[2006]] లో గంగూలీ తో పాటు లక్ష్మణ్ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. లక్ష్మణ్ [[ఫిబ్రవరి]] [[2004]] లో జి.ఆర్.శైలజను వివాహమాడెను.
==ఇండియన్ ప్రీమియర్ లీగ్==
[[2008]] సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కు నేతృత్వం వహించాడు. కాని ట్వంటీ-20 ఆటలో తన బ్యాంటింగ్ తీరులో కాని, నాయకత్వం కాని చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సీజన్ పూర్తి కాకుండానే తన నాయకత్వ బాధ్యతలను వైస్ కెప్టెన్ [[ఆడం గిల్‌క్రిస్ట్] కు అప్పగించాల్సి వచ్చింది. చివరికి దక్కన్ చార్జర్స్ చివరి నుంచి రెండో స్థానం మాత్రమే పొందగలిగింది. [[2009]] సీజన్ ఐ.పి.ఎల్. కొరకు ఏకంగా లక్ష్మణ్‌ను నాయకత్వ బాధ్యతలనుంచి తొలిగించి ఆడం గిల్‌క్రిస్ట్‌కు కట్టబెట్టారు. ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న లక్ష్మణ్‌ను ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన ముందు తప్పించడం, ఆస్ట్రేలియాకు చెందిన డారెన్ లీమన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగానే దక్కన్ చార్జర్స్ ఈ నిర్ణయం తీసుకొనడం లక్ష్మణ్ ఆత్మ విశ్వాసం దెబ్బతీసేందుకేనని అనుమానాలకు తావిస్తోంది. <ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 14, తేది 30.09.2008.</ref>
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/వి.వి.యెస్.లక్ష్మణ్" నుండి వెలికితీశారు