చెన్నమనేని హన్మంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
| birth_date={{birth date|df=yes|1929|05|15}}
| death_date=
| birth_place= [[కరీంనగర్ జిల్లా]] నాగారం, తెలంగాణ
| known= భారత దేశ ఆర్థిక వేత్త
| party=
పంక్తి 12:
 
జాతీయస్థాయి ఆర్థికవేత్తగా పేరుపొందిన '''చెన్నమనేని హనమంతరావు''' [[కరీంనగర్ జిల్లా]] నాగారంలో [[1929]], [[మే 15]]న జన్మించారు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుంచి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన హన్మంతరావు విద్యార్థిదశలోనే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆల్ హైదరాబాదు స్టూడెంట్స్ యూనియన్‌కు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1957లో రాజకీయాల నుంచి వైదొలిగి ఆర్థిక పరిశోధన రంగంలోకి వెళ్ళారు.
 
==ఆర్థిక ప్రస్థానం==
1961లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పొంది, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉద్యోగంలో ప్రవేశించారు. 1966లో చికాగో విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ లో పీహెచ్‌డి కొరకు వెళ్ళారు. [[రాజీవ్ గాంధీ|రాజీవ్‌గాంధీ]] ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 20 సూత్రాల సలహా కమిటీ చైర్మెన్‌గా అవకాశం లభించింది. 1990లో జాతీయ శ్రామిక సంఘం చైర్మెన్‌గా నియమితులైనారు. రిజర్వ్ బ్యాంక్ డైరెక్టరుగా, ఏడవ, ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక సభ్యుడిగా పనిచేశారు, ఆర్థికరంగంలో చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ బిరుదు పొందారు. హన్మంతరావు, దేశంలోని సామాజిక, ఆర్థిక, వ్యవసాయరంగ పరిస్థితులపై అనేక పరిశోధనలు చేసి, విలువైన గ్రంథాలు రచించారు. 1982-86 మధ్య ఏడో, ఎనిమిదో కేంద్ర ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడిగా, ఇండియన్ సొసైటీ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవలి వరకు హైదరాబాదు ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్8 అధ్యక్షుడిగా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రోత్ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ సలహామండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.<ref>{{Cite web |url=http://namasthetelangaana.com/Districts/Karimnagar/zoneNews.asp?category=18&subCategory=15&ContentId=66074 |title=నమస్తే తెలంగాణా లో వ్యాసం |website= |access-date=2014-01-15 |archive-url=https://web.archive.org/web/20160305140947/http://namasthetelangaana.com/Districts/Karimnagar/zoneNews.asp?category=18&subCategory=15&ContentId=66074 |archive-date=2016-03-05 |url-status=dead }}</ref> వ్యవసాయ అర్థశాస్త్రం, గ్రామీణ పేదరికం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి అంశాలపై వందకుపైగా పరిశోధన పత్రాలు, పుస్తకాలు రచించారు.