కళా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇంప్రెషనిజం: id వాడుతున్నప్పుడు playlist అవసరం లేదు.
చి →‎ఇంప్రెషనిజం: చిన్న మార్పు
పంక్తి 4:
[[మాడర్న్ ఆర్ట్]]లో అత్యంత కీలకమైన కళా ఉద్యమాలలో ఇంప్రెషనిజం ఒకటి. మొదట్లో ఇంప్రెషనిజం అనే పదం అవమానకరంగా ఉపయోగించబడేది. క్లాడ్ మోనెట్ చిత్రీకరించిన సన్ రైజ్ అనే చిత్రపటాన్ని ఉద్దేశించి లూయిస్ లీ రాయ్ అనే కళా విమర్శకుడు ఈ పదాన్ని తొట్టతొలుత ఉపయోగించాడు. అదివరకు [[చిత్రలేఖనం]]లో కేవలం చరిత్రకు లేదా పౌరాణిక ఘట్టాలకు మాత్రం పరిమితం అయ్యింది. కానీ ఇంప్రెషనిజం ఈ సంప్రదాయాన్ని తిరస్కరించింది. ఫ్రెంచి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ రియలిస్టిక్ ఆర్ట్ (పోర్ట్రెయిట్ లకు, చారిత్రక చిత్రలేఖనాల) కు పరిపూర్ణ మద్దతు ప్రకటించింది. ల్యాండ్ స్కేప్ స్టిల్ లైఫ్ పెయింటింగులు నాసిరకమైనవిగా భావించింది. అప్పటి యువ చిత్రకారులు అయిన క్లౌడ్ మానెట్, పియర్ రెన్వా, ఆల్ఫ్రెడ్ సిసిలీ, ఫ్రెడెరిక్ బజీర్ అకాడామీ యొక్క దృక్కోణాన్ని, కళాత్మక శైలులను విమర్శించారు. ఇంప్రెషనిస్టు శైలిలో వీరు చేసిన చిత్రీకరణలు అకాడమీ ధిక్కారానికి, కళా ప్రపంచంలో వాదోపవాదాలకు తెర తీశాయి. ఈ చిత్రలేఖనాలపై తమకంటూ ఒక అభిప్రాయం కలదని, కావున వాటిని సందర్శించే సదుపాయం కలుగజేయాలని సాధారణ ప్రజానీకం అప్పటి రాజు అయిన నెపోలియన్ iii కు విన్నవించుకోగా, The Salon of the Refused లో ఈ చిత్రలేఖనాలు ప్రదర్శింపబడ్డాయి. కళలోని ఈ క్రొత్త శైలిని, సాంకేతికతను ప్రజలు ఆస్వాదించసాగారు. సలోన్ ప్రారంభించిన మూడవ యేట (1876) ఇంప్రెషనిజం ఊపందుకొంది. 1886 వరకూ ఇంప్రెషనిజం చిత్రలేఖనంలో రాజ్యం ఏలింది.
 
ఇంప్రెషనిస్టు చిత్రలేఖనంలో స్పష్టమైన వివరాలు ఉండవు. చిన్న కుంచె ఘతాలతోనే చిత్రీకరణ జరుగుతుంది. చైతన్యం ఇంప్రెషనిజంలో కీలకమైన అంశం. రంగులను ఒకదానితో ఒకటి కలపకుండా, ఒకదాని ప్రక్కనే మరొకదానిని పేరుస్తూ, కళాకారులు ఈ చైతన్యాన్ని చిత్రలేఖనంలో చొప్పించేవారు. చారిత్రక/పౌరాణిక దృశ్యాలకు భిన్నంగా పట్టణాలలోని పలు దృశ్యాలను చిత్రీకరించేవారు. చిత్రీకరించబడే అంశాలు సాధారణ కాంతిలోనే ఉన్నట్టుగానే చిత్రీకరించటం ఇంప్రెషనిజంలో మరొక మెళకువ. అయితే మానేతో రెండు నెలలు కలిసి పనిచేసి, ఇంప్రెషనిజంలో కృషి చేసిన రెన్వా, తర్వాత ఈ శైలిని తన చిత్రలేఖనంలో పలు పోర్ట్రెయిట్ లకు కూడా అన్వయించాడు. అప్పటి కళాకారులకు రెన్వా యొక్క ఈ ప్రయోగం కూడా నచ్చలేదు. డేగా కూడా సాంప్రదాయ కళను ఇంప్రెషనిజాన్ని కలగలిపి పలు కళాఖండాలను ఆవిష్కరించాడు. ఔట్ లైన్ ల పట్ల స్పష్టత, గీతల వంపులలో కొనసాగింపు లతో డేగా ఇంప్రెషనిజంలో తనదైన ముద్ర వేశాడు. <ref name=":0">{{Cite web|url=https://www.youtube.com/watch?v=kuOonogw-TM&list=PL9rOZa5hgpn823qQFgWnGzxB1t7avVNwS&index=1|title=Impressionism - Overview from Phil Hansen|last=Hansen|first=Phil|website=youtube.com|url-status=live|access-date=20 October 2021}}</ref> <ref>{{YouTube|id=kuOonogw-TM|time=5m32s|title=Art Movements}}</ref> సంప్రదాయాలను ధిక్కరించిన ఇంప్రెషనిజం, కళను క్రొత శిఖరాలకు తీసుకువెళ్ళటమే కాక, కళను మనం చూసే విధానాన్ని కూడా మార్చివేసింది.
 
== పోస్ట్ ఇంప్రెషనిజం ==
"https://te.wikipedia.org/wiki/కళా_ఉద్యమం" నుండి వెలికితీశారు