నేరేళ్ల ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
నేరేళ్ల ఆంజనేయులు [[తెలంగాణ రాష్ట్రం]], [[కామారెడ్డి జిల్లా]], [[గాంధారి మండలం (కామారెడ్డి జిల్లా)|గాంధారి మండలం]], [[గాంధారి (కామారెడ్డి జిల్లా)|గాంధారి గ్రామం]]లో 3 జులై 1953లో జన్మించాడు. ఆయన బీఎస్సీ వరకు చదువుకున్నాడు.
==రాజకీయ జీవితం==
నేరెళ్ల ఆంజనేయులు 1981లో ఎల్లారెడ్డి పంచాయతీ సమితి కో–ఆప్షన్‌ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి టీడీపీలో చేరాడు. ఆయన 1987లో గాంధారి సహకార సంఘం చైర్మన్‌గా, 1988లో గాంధారి సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆంజనేయులు 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో [[ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం|ఎల్లారెడ్డి నియోజకవర్గం]] నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాడు.<ref name="సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!">{{cite news |last1=Sakshi |title=సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..! |url=https://m.sakshi.com/news/telangana/sarpanch-mla-nizamabad-district-1134248 |accessdate=25 November 2021 |work= |date=13 November 2018 |archiveurl=https://web.archive.org/web/20211125062153/https://m.sakshi.com/news/telangana/sarpanch-mla-nizamabad-district-1134248 |archivedate=25 November 2021 |language=te}}</ref>
 
నేరెళ్ల ఆంజనేయులు 1998లో ప్రభుత్వ విప్‌గా పని చేశాడు. ఆయన 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ చైర్మన్‌గా పని చేసి, 2004లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన సెప్టెంబర్ 2018లో టీడీపీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.
"https://te.wikipedia.org/wiki/నేరేళ్ల_ఆంజనేయులు" నుండి వెలికితీశారు