కళా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చిత్రలేఖనం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎ఇంప్రెషనిజం: రినైజెన్స్
పంక్తి 1:
కళా ఉద్యమం (ఆంగ్లం: [[:en:Art Movement|'''Art Movement''']]) అనగా ఒక కళాకారుల సమూహం చే కళ లోని ఒక ప్రత్యేక సిద్దాంతాన్ని లేదా ఒక ఆదర్శాన్ని నిర్ధారిత కాలం వరకూ ఆచరించబడి, విస్తరింపబడ్డ ఒక రకమైన శైలి లేదా ప్రబలమైన ప్రవృత్తి. <ref>{{Cite web|url=https://www.britannica.com/topic/list-of-art-and-design-movements-of-the-20th-century-2004700|title=List of art and design movements of the 20th century|website=britannica.com|url-status=live|access-date=19 October 2021}}</ref>
 
== రినైజెన్స్ ==
రినైజెన్స్ [[ఐరోపా]] ఖండంలో 14-17వ శతాబ్దాలలో ఏర్పడ్డ ఒక సాంస్కృతిక/రాజకీయ/ఆర్థిక/[[కళా ఉద్యమం]].  మధ్య యుగాలు అప్పటికే అంతానికి రావటం, తత్వశాస్త్రం, రచన, కళను పునరుద్ధరించటం; ఈ కళకు శాస్త్రీయత ఆపాదించబడటం , కళాభ్యాసం లో ఇది ఒక భాగం కావటం తో రినైజెన్స్ ఆసక్తిని నెలకొల్పింది. మధ్యయుగాలకు, ఆధునిక ఐరోపా కు వారధి వేసిన కీర్తి రినైజెన్స్ సొంతం చేసుకొంది. అనేక మేధావులు, రచయితలు, రాజనీతిజ్ఞులు, శాస్త్రవేత్తలు, కళాకారులు రినైజెన్స్ కాలం లో వృద్ధి లోకి వచ్చారు. రినైజెన్స్ సమయంలో ప్రపంచాన్వేషణ పెరగటం తో, ఐరోపా వాణిజ్యం ఇతర దేశాలకు, వారి సంస్కృతులకు ఆహ్వానం పలికింది.
 
[[ప్లేగు]] వ్యాధితో ఐరోపా లో పెద్ద ఎత్తులో సంభవించిన మరణాల పిమ్మట ప్రాచీన [[గ్రీకు భాష]] మరియు [[లాటిన్]] సాహిత్యాల పై ఆసక్తి పెరగటం, గూటెన్ బర్గ్ లో ముద్రణాలయం స్థాపించబడటం, ఈ సాహిత్యం ఆ ముద్రణాలయం ద్వారా విస్తరించబడటం, పాఠకులు పెరగటం రినైజెన్స్ కు దారులు వేశాయి. హ్యూమనిజం, న్యాచురలిజం, రియలిజం వంటి వాటి యొక్క ప్రభావం కూడా రినైజెన్స్ పై తగినంత పడింది. అందుకే రినైజెన్స్ లో వాస్తవికత, సహజత్వం పాళ్ళు కొట్టొచ్చినట్టు కనబడతాయి.
 
====== లియొనార్డో డా విన్సీ ======
మైఖెలేంజిలో చే చెక్కబడిన డేవిడ్ శిల్పం
మానవ శరీర నిర్మాణం, గాలిలో ఎగురగలిగే విధానం, మొక్కల, జంతువుల శరీర నిర్మాణం వంటి పలు శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న డా విన్సీ కి చిత్రలేఖనం చేయటానికి సమయం ఉండేది కాదు. అయిననూ అతని చే చిత్రీకరించబడ్డ [[మోనా లీసా]], ద వర్జిన్ ఆఫ్ ద రాక్స్, ద లాస్ట్ సప్పర్ వంటి కళాఖండాలు అతనికి పేరు తెచ్చాయి.
 
=== మైఖెలేంజిలో ===
మైఖేలేంజిలో చెక్కిన శిల్పాలు పీటా (Pieta), డేవిడ్ లు సాంకేతిక సామర్థ్యం, మానవ శరీర నిర్మాణం లో కొలతలు కలగలిపితే అవతరించే అద్భుతమైన సృష్టికి, వాటి ద్వారా వ్యక్తీకరించగలిగే భావోద్వేగాలకు మచ్చుతునకలు గా మిగిలిపోయాయి. సిస్టీన్ ఛాపెల్ లో మైఖేలేంజిలో వేసిన మ్యూరల్ చిత్రపటం అత్యంత సంక్లిష్టమైన క్రిస్టియన్ థియాలజీని నియోప్లాటోనిక్ ఆలోచనాతత్వాన్ని కలబోతకు కీర్తిప్రతిష్టలను అందుకొంది.
 
=== రఫాయెల్ ===
రఫాయెల్ చిత్రీకరణ అయిన ద స్కూల్ ఆఫ్ ఏథెన్స్ అరిస్టాటిల్, ప్లేటో వంటి తత్వవేత్తల ఆలోచనలను కొందరు మేధావులు చర్చిస్తోన్న చిత్రపటం. తొలుత రఫాయెల్ పై లియొనార్డో ప్రభావం కనబడినా, తర్వాత రఫాయెల్ ఈ ప్రభావం నుండి బయటపడి సామరస్యం, స్పష్టతలతో తనదైన శైలులను తీసుకువచ్చాడు.
 
చిత్ర/శిల్పకళలకు మాత్రమే పరిమితం కాకుండా హై రినైజెన్స్ సంగీతం, భవన నిర్మాణ శాస్త్రాలకు సైతం వ్యాపించింది.
 
=== రినైజెన్స్ మ్యాన్ ===
డా విన్సీ, [[మైఖేలాంజెలో]], రఫాయెల్ ల మధ్య పోటీ హై రినైజెన్స్ కు దారి తీసింది. ముగ్గురి మధ్యన గట్టి పోటీ ఉన్నను అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యుడైన డా విన్సీ యే రినైజెన్స్ మ్యాన్ గా గుర్తింపబడ్డాడు. మైఖెలేంజిలో తన సృజనా శక్తి, మానవ శరీరం భావోద్రేకాల వ్యక్తీకరణకు ఉపయోగించదగ్గ ఒక వాహనం అని తెలిపే ప్రాజెక్టులు చేపట్టి; రఫాయేల్ శాస్త్రీయ అంశాలైన సామరస్యం, అందం, నైర్మల్యాలతో డా విన్సీకి గట్టి పోటీ ఇచ్చారు.
 
== ఇంప్రెషనిజం ==
"https://te.wikipedia.org/wiki/కళా_ఉద్యమం" నుండి వెలికితీశారు