కళా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇంప్రెషనిజం: రినైజెన్స్
పంక్తి 2:
 
== రినైజెన్స్ ==
రినైజెన్స్ [[ఐరోపా]] ఖండంలో 14-17వ శతాబ్దాలలో ఏర్పడ్డ ఒక సాంస్కృతిక/రాజకీయ/ఆర్థిక/[[కళా ఉద్యమం]].  మధ్య యుగాలు అప్పటికే అంతానికి రావటం, తత్వశాస్త్రం, రచన, కళను పునరుద్ధరించటం; ఈ కళకు శాస్త్రీయత ఆపాదించబడటం , కళాభ్యాసం లో ఇది ఒక భాగం కావటం తో రినైజెన్స్ ఆసక్తిని నెలకొల్పింది. మధ్యయుగాలకు, ఆధునిక ఐరోపా కు వారధి వేసిన కీర్తి రినైజెన్స్ సొంతం చేసుకొంది. అనేక మేధావులు, రచయితలు, రాజనీతిజ్ఞులు, శాస్త్రవేత్తలు, కళాకారులు రినైజెన్స్ కాలం లో వృద్ధి లోకి వచ్చారు. రినైజెన్స్ సమయంలో ప్రపంచాన్వేషణ పెరగటం తో, ఐరోపా వాణిజ్యం ఇతర దేశాలకు, వారి సంస్కృతులకు ఆహ్వానం పలికింది.<ref>{{Cite web|url=https://www.britannica.com/event/Renaissance|title=Renaissance|website=britannica.com|url-status=live|access-date=26 November 2021}}</ref>
 
[[ప్లేగు]] వ్యాధితో ఐరోపా లో పెద్ద ఎత్తులో సంభవించిన మరణాల పిమ్మట ప్రాచీన [[గ్రీకు భాష]] మరియు [[లాటిన్]] సాహిత్యాల పై ఆసక్తి పెరగటం, గూటెన్ బర్గ్ లో ముద్రణాలయం స్థాపించబడటం, ఈ సాహిత్యం ఆ ముద్రణాలయం ద్వారా విస్తరించబడటం, పాఠకులు పెరగటం రినైజెన్స్ కు దారులు వేశాయి. హ్యూమనిజం, న్యాచురలిజం, రియలిజం వంటి వాటి యొక్క ప్రభావం కూడా రినైజెన్స్ పై తగినంత పడింది. అందుకే రినైజెన్స్ లో వాస్తవికత, సహజత్వం పాళ్ళు కొట్టొచ్చినట్టు కనబడతాయి.
"https://te.wikipedia.org/wiki/కళా_ఉద్యమం" నుండి వెలికితీశారు