"భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ" కూర్పుల మధ్య తేడాలు

చి
[[కేరళ]]లో [[తిరువనంతపురం]] సమీపాన భూ అయస్కాంత రేఖకు దగ్గరలో ఉన్న తుంబాలో [[1962]]లో మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మించారు. అప్పటి శాస్త్రవేత్తలలో [[అబ్దుల్ కలాం]] ఒకరు. మొదట కేవలం రాకెట్ల ప్రయోగకేంద్రముగా ఉన్న తుంబా నెమ్మదిగా రాకెట్లకు అవసరమయిన ప్రొపెల్లర్లు, ఇంజన్లు తయారు చేసి అమర్చగలిగి పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా తయారయింది.
===శ్రీహరి కోట===
[[భారతదేశం]]లో ఉపగ్రహాల ప్రయోగానికి అత్యంత అనువయిన ప్రదేశమయిన [[శ్రీహరి కోటశ్రీహరికోట]] [[నెల్లూరు]] జిల్లాలో [[సూళ్ళూరుపేట]] దగ్గర ఉన్నది. ఈ అంతరిక్ష కేంద్రం పేరు ''సతీష్ ధావన్ స్పేస్ సెంటర్'', దీనినే ''షార్'' అని కూడా పిలుస్తారు. ఇది [[భారతదేశం]]లోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV మరియు GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండిటివల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉన్నది.
 
===బలేశ్వర్===
ఇది [[ఒరిస్సా]]లో ఉన్నది. [[శ్రీహరి కోట]]లో ఉన్నట్లు ఇక్కడ శాటిలైట్ల ప్రయోగానికి సౌకర్యాలు లేకున్నా,దీనిని ప్రధానంగా రాకెట్లను ప్రయోగించుటకు ఉపయోగిస్తారు.
119

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/341674" నుండి వెలికితీశారు