సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ja:サチン・テンドルカール
పంక్తి 58:
'''షేర్‌వార్న్ కు సింహస్వప్నం''' : [[1998]] [[ఆస్ట్రేలియా]] పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ [[షేన్‌వార్న్]] బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం<ref> SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. Down Memory Lane - Shane Warne's nightmare. November 29, 2004 </ref>.
 
'''నాయకత్వం''' : ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా [[అజహరుద్దీన్]] నుంచి సచిన్ తెండుల్కర్ కు నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కాని ఈ సీరీస్ కొత్త ప్రపంచ చాంపియన్ చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. <ref> [http://aus.cricinfo.com/db/ARCHIVE/1999-2000/IND_IN_AUS/SCORECARDS/IND_AUS_T2_26-30DEC1999.html Cricinfo match report AUS v IND 3rd Test 26-30 December 1999]</ref> ఆ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాద్యతల నుంచి తప్పుకున్నాడు.అతని తర్వాత [[2002000]] లో [[సౌరవ్ గంగూలీ]] కి కెప్తెన్సీ ఇవ్వబడింది. resigned, and [[Sourav Ganguly]].
 
'''200032003 ప్రపంచ కప్''' : [[2003]] ప్రపంచ కప్ లో సచిన్ 11 మ్యాచ్ లలో 673 పరుగులు సాధించి భారత్ ను ఫైనల్స్ కి చేర్చినాడు. కాని ఈ సారి కూడా ఆస్త్రేలియాకే విజయం వరించింది. అయిననూ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డ్ మాత్రం ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన సచిన్ కే వరిందింది. 2003-04 లో భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో [[సిడ్నీ]] లో జర్గిన చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ డబుల్ సెంచరీ సాధించాడు.
 
'''అత్యధిక టెస్ట్ సెంచరీల రికార్డు''' : [[డెసెంబర్ 10]], [[2005]] న [[ఢిల్లీ]] లోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో [[శ్రీలంక]] పై ఆడితూ 35 వ తెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. దీంతో ఇది వరకు [[సునీల్ గవాస్కర్]] పేరిట ఉన్న 34 టెస్ట్ సెంచరీల రికార్డును విచ్ఛిన్నమైంది.
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు