"షిర్డీ సాయిబాబా" కూర్పుల మధ్య తేడాలు

→‎బోధనలు: image replaced by duplicate
చి (యంత్రము కలుపుతున్నది: wuu:赛义巴巴)
(→‎బోధనలు: image replaced by duplicate)
 
==బోధనలు==
[[Image:SaibabaShirdi sai3.jpg|framethumb|right|మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా]]
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించాడు. [[నమాజ్]] చదవడం, అల్-ఫతీహా మననం, [[ఖొరాన్]] అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించాడు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling The Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1999 | pages = p.29 | isbn = 8120721470}}</ref> ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించాడు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించాడు.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 139 | isbn = 0791412687}}</ref> తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పాడు. ప్రార్ధన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించాడు. [[ఖొరాన్]] చదువమని ముస్లిములకూ, [[రామాయణం]], [[భగవద్గీత]], [[విష్ణు సహస్రనామ స్తోత్రం]] వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించాడు.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 27 [http://www.saibaba.org/satcharitra/sai27.html]</ref> నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పాడు. తన భక్తులకు [[రెండు]] ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పాడు - అవి '''శ్రద్ధ''' (విశ్వాసం, భక్తి, దీక్ష), '''సబూరి''' (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టాడు<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 3 [http://www.saibaba.org/satcharitra/sai3.html]</ref>. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించాడు.
 
# నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
# నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
 
==భక్తులు, పూజా విధానాలు==
ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.<ref name=srinivas>Srinivas ''Sathya Sai Baba movement''</ref>
19

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/342276" నుండి వెలికితీశారు