పొట్లూరి మోహన రామ ప్రసాదు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''పొట్లూరి మోహన రామ ప్రసాదు ''' తెలుగు కవి, కథా రచయిత, న్యాయవాది. ప్రధానంగా హైకూ కవి. ఇప్పటికి నాలుగు హైకూ సంపుటాలు వెలువరించాడు. రంగస్థలంపై నటించిన అనుభవం కూడా ఉంది. దాదా...'
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

05:57, 11 డిసెంబరు 2021 నాటి కూర్పు

పొట్లూరి మోహన రామ ప్రసాదు తెలుగు కవి, కథా రచయిత, న్యాయవాది. ప్రధానంగా హైకూ కవి. ఇప్పటికి నాలుగు హైకూ సంపుటాలు వెలువరించాడు. రంగస్థలంపై నటించిన అనుభవం కూడా ఉంది. దాదాపు 20 నాటకాలు వేశాడు. లఘు చిత్రాలను నిర్మించాడు. కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తూ పలు లఘు చిత్రాలను తీశాడు.

స్వస్థలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలంలోని తెన్నేరు వీరి స్వస్థలం.. తల్లిదండ్రులు అన్నపూర్ణాదేవి, కృష్ణమూర్తి. ప్రస్తుతం విజయవాడలో స్థిరపడ్డాడు.

విద్యాభ్యాసం

వాణిజ్య శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశాడు. పూణే విశ్వవిద్యాలయం నుండి 1987 లో లా డిగ్రీ ని పొందాడు.

వృత్తి

వృత్తిరీత్యా ఇతను న్యాయవాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు.

 
పొట్లూరి పుస్తకాలు

రచనలు

మా ఊరు ఒక హైకూ[1] మా బడిలో హైకూలు[2], పూల రేకులు[3], తనేను[4] అను నాలుగు హైకూ సంపుటాలు వెలువరించాడు.

మా ఊరు ఒక హైకు

ఈ హైకూల రచనాకాలం 1995. ఈ పుస్తకం అట్లూరి రాజ మనోహరం అట్లూరి రాజగోపాల రావులకు అంకితమివ్వబడినది. ఈ పుస్తకానికి శ్యామ్ కుమార్ కర్రి ముఖచిత్రం వేశాడు. ఈ పుస్తకానికి కవిత్వం తొడుక్కున్న ఊరు కనురెప్పల నిశ్శబ్ద మోహనరాగం అంటూ డాక్టర్ సశ్రీ ముందుమాట రాశాడు. ఇందులో కొన్ని హైకూలు "చింత తోపుల్లోంచి/ చందమామని చూస్తే/మా ఊరు కనిపిస్తుంది", "ఊళ్లో రైలు ఆగేది/ఎక్కింది దిగింది/లెక్కేలేదు", "జడలాగినమ్మాయిని/మా ఆవిడకి చూపించా/ఇద్దరూ నవ్వుకున్నారు".

మా బడిలో హైకూలు

ఈ పుస్తకంలోని హైకూలు 1995 1996 కాలంలో రచించబడినవి. ఇందులోని కొన్ని హైకూలు..."మా బడికెళ్ళా/వేసిన గోడకుర్చీ/కనిపించలేదు", "మాబడికెళ్ళా/బెంచీల మీద పేర్లు/చెరగలేదు", "బడి గుర్తొస్తే/సిరామరకలన్నీ/గుర్తుకొస్తాయి".

పూల రేకులు

ఈ పుస్తకానికి ముఖచిత్రం శ్యామ్ కుమార్ కర్రీ వేశాడు. 'హైకూ మోహన సమ్మోహనం పూలరేకులు ' అంటూ చిత్తలూరి సత్యనారాయణ ఈ పుస్తకానికి ముందుమాట రాశాడు. ఇందులోని కొన్ని హైకూలు..."బంతి చేమంతి/తోటలోనే రాలాయి/కోయలేదుగా", "వానచినుకు/కొమ్మల మీద పడి/పువ్వులైనాయి", "నల్లని మబ్బు/తోటమీంచి వెళుతూ/పూలనిచ్చింది".

తనేను

ఇందులోని కొన్ని హైకూలు..."ఆమె వెళ్ళింది/కొన్ని అక్షరాలని/కవిత చేసి", "ఆమె లేకుంటే/ప్రపంచమే లేదుగా/ఉన్నా అంతేగా", "తోటలో పూలు/పూస్తున్నా రాలవేంటి/ ఆమె వచ్చిందా?"

మూలాలు

  1. మా ఊరు ఒక హైకూ -పొట్లూరి మోహన రామ ప్రసాదు- చినుకు పబ్లికేషన్స్, గాంధీనగర్, విజయవాడ, ఆగస్టు 2020
  2. మా బడిలో పొట్లూరి మోహన రామ ప్రసాద్ చినుకు పబ్లికేషన్స్, గాంధీనగర్, విజయవాడ, సెప్టెంబర్, 2020
  3. పూల రేకులు-పొట్లూరి మోహన రామ ప్రసాదు- చినుకు పబ్లికేషన్స్, గాంధీనగర్, విజయవాడ, ఫిబ్రవరి, 2021
  4. తనేను - పొట్లూరి మోహన రామ ప్రసాద్-చినుకు పబ్లికేషన్స్, గాంధీనగర్, విజయవాడ, ఆగస్టు, 2021